Published
Wed, Aug 17 2016 9:54 PM
| Last Updated on Mon, Sep 4 2017 9:41 AM
విద్యార్థులకు నోట్‌పుస్తకాల పంపిణీ
చౌటుప్పల్: మండలంలోని తాళ్లసింగారంలోని ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు బుధవారం నార్మ్ ఆధ్వర్యంలో నోట్‌పుస్తకాలు, పలకలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నార్మ్ కో–ఆర్డినేటర్ డాక్టర్ సంధ్యాసెనాయ్ మాట్లాడారు. విద్యార్థులు చక్కగా చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నారు. నార్మ్ ద్వారా అవసరమైన సహాయ, సహకారాలను అందిస్తామన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ సుర్వి నర్సింహగౌడ్, డాక్టర్ వీకేజే.రావు, ప్రధానోపాధ్యాయుడు హర్షవర్ధన్‌రెడ్డి, అనుపమ, సమత, జంపాల కృష్ణ, సుక్క అమృత, మార్క్, లక్ష్మయ్య, వెంకటేశం పాల్గొన్నారు.