విద్యార్థులకు నోటు పుస్తకాల పంపిణీ
విద్యార్థులకు నోటు పుస్తకాల పంపిణీ
Published Fri, Aug 19 2016 6:25 PM | Last Updated on Mon, Sep 4 2017 9:58 AM
చౌటుప్పల్: మండలంలోని తంగడపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ హైస్కూల్‌లో శుక్రవారం హైదరాబాద్‌కు చెందిన పారిశ్రామికవేత్త సంకా మోహనకృష్ణమూర్తి తన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం విద్యార్థులకు నోటు పుస్తకాలు, పెన్సిల్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరారు. శాస్త్రవేత్తలుగా, ఇంజినీర్లుగా, డాక్టర్లుగా ఎదిగి, సమాజానికి సేవ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు బి.రవీందర్, ఎ.నాగయ్య, మోటె సత్తయ్య, మాధవరెడ్డి, శ్రీరాములు, మోహన్‌రావు, ముర ళీమోహన్, మంజుల తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement