Published
Tue, Jul 19 2016 10:37 PM
| Last Updated on Mon, Sep 4 2017 5:19 AM
విద్యార్థులకు నోటుపుస్తకాలు, స్టేషనరీ పంపిణీ
హుజూర్‌నగర్ : పట్టణంలోని అంబేద్కర్‌నగర్ ప్రాథమిక పాఠశాలలో మంగళవారం దళిత మహిళా సంఘం వ్యవస్థాపక అధ్యక్షురాలు చెవుల కవిత 60 మంది విద్యార్థులకు నోటు పుస్తకాలు, స్టేషనరీ అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులు దాతల ప్రోత్సహకాలను సద్వినియోగం చేసుకొని విద్యలో రాణించాలన్నారు. కార్యక్రమంలో ఎంఈఓ లక్‌పతినాయక్, హెచ్‌ఎం భాస్కర్ రెడ్డి, ఉపాధ్యాయులు రామ్మూర్తి, నర్సింహారావు, సీహెచ్.రత్తయ్య, టీఆర్‌ఎస్ మహిళా నాయకురాలు గోపు చెలీనమ్మ, భవాని, రమ్య, చంద్రకళ, విద్యార్థులు పాల్గొన్నారు.