కొత్త నోట్‌బుక్స్‌తో శైలేంద్ర, రవినారాయణన్ (కుడి)
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: నోట్‌బుక్స్ మార్కెట్ దేశంలో రూ.6,000 కోట్లుంది. ఈ రంగంలో ఐటీసీ క్లాస్‌మేట్‌కు 25 శాతం వాటా ఉందని కంపెనీ ఎడ్యుకేషన్, స్టేషనరీ ప్రొడక్టస్ బిజినెస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ శైలేంద్ర త్యాగి తెలిపారు. పల్స్ 3డీ నోట్‌బుక్స్‌ను విడుదల చేసిన సందర్భంగా సేల్స్ హెడ్ రవినారాయణన్‌తో కలిసి బుధవారమిక్కడ ఆయన మీడియాతో మాట్లాడారు. ‘పరిశ్రమ వృద్ధి రేటు ఏటా 4–5 శాతముంది. క్లాస్‌మేట్ రెండంకెల వృద్ధి నమోదు చేస్తోంది. ఏటా 38 కోట్ల నోట్‌బుక్స్ అమ్ముతున్నాం. కంపెనీ మొత్తం ఉత్పత్తిలో భద్రాచలం యూనిట్ 60 శాతం సమకూరుస్తోంది’ అని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment