ఎన్‌ఆర్‌ఐలు సహకరించాలి
బంగారు తెలంగాణ నిర్మించాలి
హైదరాబాద్‌లో పరిశ్రమల స్థాపనకే రారుుతీలు
‘సాక్షి’ ఇంటర్వ్యులో ఎంపీ కవిత
రాయికల్ : అనేక ఉద్యమాలు, బలిదానాల ద్వారా ఆవిర్భవించిన తెలంగాణ.. బంగారు తెలంగాణగా నిర్మించడం కోసం వివిధ దేశాల్లోని ఎన్‌ఆర్‌ఐలు సహకరించాలని నిజామాబాద్ ఎంపీ, తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు ఎంపీ కవిత కోరారు. అమెరికా పర్యటన ముగించుకొని రాయికల్‌కు చేరుకున్నాక తన పర్యటన విశేషాలపై ‘సాక్షి’ జరిపిన ఇంటర్వ్యూ వివరాలు..
ప్రశ్న : అమెరికాలో ఏప్రిల్ ఒకటి నుంచి 9వ తేదీ వరకు ప్రిన్స్‌టాన్ యూనివర్సిటీలో ఏయే అంశాలపై సెమినార్ జరిగింది. దేశం నుంచి ఎంతమంది ఎంపీలు పాల్గొన్నారు?
జవాబు : సెమినార్‌లో మనదేశంలో నుంచి నాతోపాటు ఆరుగురు ఎంపీలు హాజరయ్యూరు. ఇందులో అంతర్జాతీయ వ్యుహాత్మక సంబంధాల్లో ప్రస్తుత అవసరాలు, యూరప్‌లో ముస్లింల వలసలు, అఫ్ఘనిస్థాన్‌లో అమెరికా సేనల ఉపసంహరణ, అణుప్రయోగాలు, ఒప్పందాలు, సైబర్ నేరాలు, భద్రత వంటి అంశాలపై చర్చ జరిగింది.
ప్ర : షికాగో స్టేట్ యూనివర్సిటీ - తెలంగా ణ యూనివర్సిటీ మధ్య ఒప్పందం ఏమిటి?
జ : రెండు యూనివర్సిటీల ఒప్పందం ద్వారా మేధోవనరులు, విద్యార్థుల మార్పిడికి అవకాశం ఏర్పడుతుంది. ముఖ్యంగా కంప్యూటర్ సైన్స్, ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్లలో ఇది దోహదపడుతుంది. ఈ యూనివర్సిటీలో చదివిన విద్యార్థులు మార్చుకునే అవకాశం ఉంటుంది. తెలంగాణ విద్యా ప్రమాణాలు తెలిపేందుకు ఒప్పందం దోహదపడుతుంది.
ప్ర :1871 వాణిజ్య కేంద్ర సందర్శనపై మీ అభిప్రాయం?
జ : వాణిజ్య కేంద్ర సందర్శన ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఉపకరిస్తుంది. వాణిజ్య కేంద్రంలో 500 కంపెనీలు రెండు వేల మంది పారిశ్రామికవేత్తలు భాగస్వాములుయ్యారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేయాలని కోరినా.. సానుకూలంగా స్పందించ డంతో దక్షిణాసియాలో హైదరాబాద్ ఒక హబ్‌గా మారే అవకాశం ఉంటుంది.
ప్ర :అమెరికాలో మీచేతుల మీదుగా ఎన్‌ఆర్‌ఐ టీఆర్‌ఎస్ ఆవిర్భవించడంపై మీఅనుభూతి?
జ :నిజంగా నా చేతుల మీదుగా అమెరికా ఎన్‌ఆర్‌ఐ టీఆర్‌ఎస్ సెల్‌ను ప్రారంభించడం నా అదృష్టం. అక్కడ హెలికాప్టర్ ద్వారా పూలవర్షం, వందకార్లతో ర్యాలీ నిర్వహించడం మరిచిపోలేది.
ప్ర :ప్రపంచంలోని తెలంగాణ ఎన్‌ఆర్‌ఐలకు మీరు ఇచ్చే సలహా ఏమిటి?
జ :ప్రపంచలోని వివిధ దేశాల్లో ఉంటున్న తెలంగాణ ఎన్‌ఆర్‌ఐలు.. తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలి. మిషన్‌కాకతీయ ద్వారా చెరువులను దత్తత తీసుకోవాలి.