ఆటా సదస్సులో ఎంపీ వినోద్‌కుమార్
రాయికల్ : అమెరికాలోని తెలంగాణ ప్రాంతానికి చెందిన ఎన్‌ఆర్‌ఐలు రాష్ట్రాభివృద్ధికి కృషి చేయాలని కరీంనగర్ ఎంపీ వినోద్‌కుమార్ కోరారు. వర్జీనియూలోని అమెరికా తెలంగాణ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సుకు ఎంపీతోపాటు కవి, సీఎం కార్యాలయ ఓఎస్‌డీ దేశపతి శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
అమెరికాలోని వివిధ స్టేట్స్‌లో ఉంటున్న ఎన్‌ఆర్‌ఐలు తెలంగాణలో పెట్టుబడులు పెడితే రాయితీలు కల్పిస్తామన్నారు. అధ్యక్షుడు రాంమోహన్, ప్రధాన కార్యదర్శి రవి, కోశాధికారి శ్రీనివాస్, బోర్డు సభ్యులు అరవింద్, చందు, మాధవరావు, ప్రకాశ్, నరేందర్‌రెడ్డి, రఘువీర్, శం కర్, శ్రీధర్, వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.