వాషింగ్టస్ : భారత్‌లో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న వేళ నరేంద్ర మోదీకి అమెరికాలోని ప్రవాసీ భారతీయులు మద్దతు ప్రకటించారు. ఆదివారం వాషింగ్టన్‌లో బీజేపీకి మద్దతుగా ర్యాలీ నిర్వహించారు. ఎన్నారైస్ ఫర్ మోదీ (NRIs4Modi ) సంస్థ ఆధ్వర్యంలో ‘ నమో క్యాపిటల్ యాత్ర’ పేరుతో క్యాపిటల్ హీల్స్ నుంచి వాషింగ్టన్ మోనుమెంట్ మీదుగా నేషనల్ ఆర్చోరేటమ్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పురుషులు, మహిళలతో పాటు చిన్న పిల్లలు కూడా పాల్గొన్నారు. నరేంద్ర మోదీ మరోసారి భారత ప్రధాన మంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment