న్యూఢిల్లీ: రద్దయిన నోట్లను మార్పిడిచేసుకోవడానికి విదేశాల్లో ఉన్న భారతీయులకిచ్చిన గడువు శుక్రవారంతో ముగిసింది. విధానపరమైన అవగాహన లోపం, పరిమిత సంఖ్యలో కౌంటర్ల ఏర్పాటు వల్ల ఇంకా చాలా మంది నోట్లు మార్చుకోలేదని తెలిసింది. తలా రూ. 25 వేలకు మించకుండా ఎన్‌ఆర్‌ఐలు తమ వద్ద ఉన్న పాత నోట్లను మార్చుకోవడానికి మాత్రం గడువు మరో మూడు నెలలు(జూన్ 30 వరకు) మిగిలే ఉంది.
విదేశాల నుంచి వచ్చే ఎన్‌ఆర్‌ఐలు విమానాశ్రయాల్లోనే తమ వద్దనున్న పాతనోట్ల వివరాలను కస్టమ్స్ అధికారులకు తెలిపి ఒక సర్టిఫికెట్‌ను పొందాలి. నోట్ల మార్పిడి వెసులుబాటు కల్పించిన ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, చెన్నై, నాగ్‌పూర్ ఆర్‌బీఐ కేంద్రాల్లో చివరి రోజైన శుక్రవారం ప్రజలు పెద్ద ఎత్తున క్యూ లైన్లలో నిలబడ్డారు.
నోట్ల మార్పిడికి ముగిసిన గడువు
Published Sat, Apr 1 2017 3:08 AM | Last Updated on Sat, Sep 22 2018 7:51 PM
Advertisement