
సాక్షి, అమరావతి: ప్రస్తుతం కరోనా కష్టకాలంలో ప్రవాసాంధ్రులు ఆంధ్రప్రదేశ్‌కు అండగా నిలవాలని ఏపీ స్పెషల్ రిప్రజంటేటివ్ రత్నాకర్ పిలుపునిచ్చారు. ప్రభుత్వానికి సాధ్యమైనంత సాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. సీఎం సహాయ నిధికి చేసే సహాయంతో ఏపీలో మరిన్ని మెరుగైన వసతులు ఏర్పాటు చేసుకోవచ్చు అని గుర్తుచేశౠరు. మరింత వేగంగా ఎక్కువ మందికి వాక్సినేషన్ ఇవ్వొచ్చు అని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఓ వీడియో సందేశం విడుదల చేశారు.
మీరు చేసే సహాయం మరిన్ని ఆస్పత్రులకు ఆక్సిజన్, వెంటిలేటర్, ఎక్మో సౌకర్యాలు అందుబాటులోకి తీసుకురావచ్చు అని రత్నాకర్ చెప్పారు. ప్రవాసాంధ్రులు ముందుకు వస్తే ఏపీలో ఆరోగ్య సౌకర్యాల కల్పన వేగంగా జరుగుతుందని పేర్కొన్నారు. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి శక్తికి మించి ప్రజలకు కరోనా నుంచి సేవలు చేస్తున్నారని గుర్తుచేశారు. మనం బాధ్యతగా ఏపీవాసులకు అండగా నిలుద్దామని ప్రవాసాంధ్రులకు ఏపీ స్పెషల్ రిప్రజంటేటివ్ రత్నాకర్ చెప్పారు.
చదవండి: రాబోయే 3, 4 వారాలు చాలా కీలకం.. మరింత జాగ్రత్త
చదవండి: లాక్‌డౌన్ పెట్టాలా లేదా అన్నది సీఎం నిర్ణయం
Comments
Please login to add a commentAdd a comment