![Police Have Solved Assassination Case Of Burahanpalle Ex Sarpanch](/styles/webp/s3/article_images/2024/08/20/Police-Have-Solved-Assassin.jpg.webp?itok=8eW-3OGZ)
సాక్షి, వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లాలో సంచలనం సృష్టించిన మాజీ సర్పంచ్ హత్య కేసును పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. సుఫారి గ్యాంగ్ సహాయంతో ఈ హత్య జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. రూ.30 లక్షల సుపారీ ఇచ్చి పథకం ప్రకారం దేవేందర్ హత్య జరిగిందని వర్ధన్నపేట ఏసీపీ నరసయ్య మీడియా సమావేశంలో వెల్లడించారు.
రాయపర్తి మండలం బురహాన్‌పల్లిలో గతనెల 7న మాజీ సర్పంచ్ సూదుల దేవేందర్ హత్యకు గురయ్యాడు. భూ తగాదాలు, వ్యక్తిగత కక్షల కారణంగా ఈ హత్య జరిగిందని.. ఈ హత్యలో పల్లె మల్లేశం అతడి కుమారుడు మురళి కీలకంగా వ్యవహరించి హైదరాబాద్‌కు చెందిన సుంకర ప్రసాద్, మర్నేని రాజు అనే సుపారి గ్యాంగ్ ద్వారా హత్య జరిగిందని పోలీసులు వెల్లడించారు.
ఈ కేసులో మొత్తం ఎనిమిది మంది అరెస్ట్ కాగా, ఇందులో A1గా సుంకర ప్రసాద్ నాయుడు, A2 గా మర్నేని రాజు సహా మరో ఆరుగురిని అరెస్టు చేసినట్లు వర్ధన్నపేట ఏసీపీ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment