Rayaparthy
-
‘ఫోన్ పే’ పట్టించింది
సాక్షి, వరంగల్: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండి యా (ఎస్బీఐ)లో 19 కిలోల బంగారం చోరీ కేసులో ముగ్గురు నిందితులను వరంగల్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. గత నెల 18వ తేదీ అర్ధరాత్రి చోరీ చేసిన ఉత్తరప్రదేశ్, మహా రాష్ట్రకు చెందిన ఏడుగురు సభ్యులతో కూడిన ముఠా కా రులో వరంగల్ మీదుగా హైదరాబాద్‌కు వెళ్లి అక్కడి నుంచి మహారా ష్ట్ర వెళ్లినట్టుగా పోలీసులు గుర్తించారు.నాందేడ్‌లోని ఓ పెట్రోల్ బంక్‌లో ఇంధనం కోసం ఫోన్ పే ద్వారా ఆన్లైన్ చెల్లింపులు చేయడంతో ఆ ఫోన్ నంబర్ ఆధారంగా ఈ కేసును ఛేదించగలి గారు. తమపైన పోలీసుల నిఘా ఉందని తెలియడంతో తిరిగి తెలంగాణకు వచ్చిన వీరిని చాకచాక్యంగా పట్టుకొని 2.520 కిలోల బంగారు ఆభరణాలు, ఒక కారు, రూ.పదివేల నగదు స్వాధీనం చేసుకున్నారు. రాజమండ్రిలోనే కుదిరిన స్నేహం యూపీకి చెందిన మహమ్మద్ నవాబ్ హసన్, సాజిద్ ఖాన్లు అన్నదమ్ములు. వీరికి సమీప గ్రామస్తులైన అర్షాద్ అన్సారీ, షాఖీర్‌ఖాన్ ఆలియాస్ బోలెఖాన్లు స్నేహితులు. ఓ దొంగతనం కేసులో మహ్మద్ నవాబ్ హసన్, సాజిద్ ఖాన్లు రాజ మండ్రి జైలుకు వెళ్లారు. ఈ సమయంలోనే మహారాష్ట్రకు చెందిన హిమాన్షు బిగాం చండ్ జాన్వర్, సాగర్ భాస్కర్ గోర్, అక్ష య్ గజానన్ అంబోర్లతో పరిచయం ఏర్పడింది. 2024, ఫిబ్ర వరి 8న కాకినాడ జిల్లా పత్తిపాక ఎస్బీఐ బ్యాంక్‌లో రూ.30 లక్షల నగదు, కోటిన్నర విలువ చేసే బంగారం దోచుకెళ్లారు. సరిగ్గా 40 రోజుల క్రితం కర్ణాటకలోని ఓ ఎస్బీఐ బ్యాంక్ లో రూ12.95 కోట్ల విలువైన బంగారం దోచుకెళ్లారు. ఆ తర్వాత గత నెల 19న గూగుల్ మ్యాప్ ద్వారా రాయపర్తి ఎస్బీఐ లొకే షన్ గుర్తించడంతోపాటు అక్కడ భద్రతా సిబ్బంది లేకపో వడాన్ని రెక్కీ చేసుకొని నిర్ధారించుకున్నాకే దొంగతనం చేశారు. రెండున్నర కిలోల బంగారం, కారు స్వాధీనం : వరంగల్ సీపీబంగారం చోరీ కేసులో ముగ్గురిని అరెస్టు చేశామని, మరో నలుగురి కోసం గాలిస్తున్నామని వరంగల్ పోలీసు కమిషనర్ అంబర్ కిశోర్ ఝా అన్నారు. వీరి నుంచి 2 కిలోల 520 గ్రా ముల బంగారం స్వాధీనం చేసుకున్నామన్నారు. పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు మహమ్మద్ నవాబ్ హసన్ రాయపర్తి మండల కేంద్రంలో ఎస్బీఐ బ్యాంక్ చోరీ అనువైనదిగా గుర్తించిన తర్వాతే ఈ బ్యాంక్‌లో బంగారం ఎత్తుకెళ్లారన్నారు. నవంబర్ 19న నిందితులు 3 బృందాలుగా విడిపోయి మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌కు తిరిగివెళ్లిపోయారు.ఈ భారీ చోరీపై అప్రమత్త మై వెస్ట్‌జోన్ డీసీపీ రాజమహేంద్ర నేతృత్వంలోని వర్థన్న పేట ఏసీపీ నర్సయ్య, సీసీఎస్ ఏసీపీ భోజరాజు, నర్సంపేట ఏసీపీ కిరణ్ కుమార్ల ఆధ్వర్యంలో పదికిపైగా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితుల పట్టుకున్నామని సీపీ కిశోర్ ఝా తెలి పారు. అరెస్టయిన వారిలో అర్షాద్ అన్సారీ, షాఖీర్ ఖాన్ అలి యాస్ బోలెఖాన్, హిమాన్షు బిగాం చండ్ జాన్వర్ ఉన్నారు. -
వరంగల్ జిల్లాలో రెచ్చిపోయిన దొంగలు
-
19 కిలోల బంగారం చోరీ
సాక్షి, వరంగల్/ రాయపర్తి: వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలోని ఎస్బీఐలో మంగళవారం తెల్లవారుజా మున భారీ దోపిడీ జరిగింది. భవనం కిటికీని తొలగించి లోపలికి వెళ్లిన దుండగులు బ్యాంకులోని మూడు లాకర్లలో ఒకదానిని గ్యాస్‌కట్టర్‌తో పగులగొట్టి దోపిడీకి పాల్పడ్డారు. బ్యాంకులోని అలారం సిస్టంను ధ్వంసం చేశారు. లాకర్లోని 19 కిలోలకుపైగా బంగారం చోరీచేసినట్లు గుర్తించారు. దీని విలువ సుమారు రూ.14.82 కోట్లు ఉంటుందని బ్యాంకు అధికారులు తెలిపారు. సీసీ కెమెరా పుటేజీకి సంబంధించిన డీవీఆర్‌ను కూడా అపహరించారు.దోపిడీకి గురైన బ్యాంకు రాయపర్తి పోలీసు స్టేషన్‌కు 500 మీటర్ల దూరంలోనే ఉన్నా నిందితులు పక్కా ప్రణాళికతో దోపిడీకి పాల్పడ్డారు. మంగళవారం ఉదయం విధులకు హాజరైన మేనేజర్ సత్యనారాయణ బ్యాంకులో చోరీ జరిగిందని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వర్ధన్నపేట సీఐ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో రాయపర్తి, వర్ధన్నపేట ఎస్సైలు శ్రవణ్‌కుమార్, రాజు దర్యాప్తు చేపట్టారు. ఘటనా స్థలాన్ని వెస్ట్‌జోన్ డీసీపీ రాజమహేంద్రనాయక్ మంగళవారం రాత్రి సందర్శించారు. దోపిడీ జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. తమిళనాడు దొంగల పనే? ఈ దోపిడీకి పాల్పడింది తమిళనాడుకు చెందిన దొంగల ముఠా అని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనా స్థలంలో తమిళ భాషలో ఉన్న ‘జోకర్’ అగ్గిపెట్టె లభించడంతో ఆ దిశగా దర్యాప్తు ముమ్మరం చేశారు. బ్యాంకు లాకర్‌ను కట్ చేసిన గ్యాస్ కట్టర్‌ను కూడా దొంగలు అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. కేసు దర్యాప్తులో అది కీలకం కానుందని పోలీసులు తెలిపారు. ఈ గ్యాస్‌కట్టర్‌ను అమెజాన్ వెబ్సైట్లో కొనుగోలు చేసినట్టు గుర్తించిన పోలీసులు.. అది డెలివరీ అయిన చిరునామా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.25 రోజల క్రితం కర్ణాటకలోని దావణగెరె జిల్లా న్యామతి పట్టణంలోని ఎస్బీఐ బ్రాంచిలో దొంగలు రూ.12.95 కోట్ల విలువైన బంగారాన్ని దోచుకెళ్లారు. అచ్చం అదే తరహాలో ఇక్కడ కూడా దోపిడీ జరగటంతో రెండు దోపిడీలు చేసింది ఒకటే ముఠా అని అనుమానిస్తున్నారు. బ్యాంకు అధికారుల అలసత్వంవల్లే: ఖాతాదారులు మండల కేంద్రంలో ఏర్పాటుచేసిన సీసీ కెమెరాలు పనిచేయటంలేదు. దీంతో దొంగలకు చోరీలు చేసి తప్పించుకోవటం తేలికైందని ఖాతాదారులు మండిపడుతున్నారు. మండల కేంద్రానికి బ్యాంకు దూరంగా ఉండటం.. గతంలో సెక్యూరిటీగార్డును నియమించినా ప్రస్తుతం తొలగించటం వల్లే దోపిడీ జరిగిందని చెప్తున్నారు. బ్యాంకులో బంగారం చోరీ అయినట్లు తెలుసుకున్న ఖాతాదారులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకొని ఆందోళనకు దిగారు.ఎంతో నమ్మకంతో బ్యాంకులో సొమ్ము దాచుకుంటే ఇలా నిర్లక్ష్యం చేయడం ఏమిటని అధికారులను నిలదీశారు. మూడేళ్ల క్రితం ఇప్పుడు పగులకొట్టిన కిటికీ నుంచి కాకుండా మరో కిటికీని పగులగొట్టి దొంగలు బ్యాంకులోకి చొరబడ్డారు. కానీ, లాకర్‌ను ఓపెన్ చేయలేక తిరిగి వెళ్లిపోయారు. పోలీసులు రాత్రిపూట పెట్రోలింగ్ నిర్వహించకపోవటం కూడా దోపిడీలకు కారణమవుతోందని స్థానికులు అంటున్నారు. -
బురహాన్‌పల్లి మాజీ సర్పంచ్ హత్య కేసులో వీడిన మిస్టరీ
సాక్షి, వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లాలో సంచలనం సృష్టించిన మాజీ సర్పంచ్ హత్య కేసును పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. సుఫారి గ్యాంగ్ సహాయంతో ఈ హత్య జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. రూ.30 లక్షల సుపారీ ఇచ్చి పథకం ప్రకారం దేవేందర్ హత్య జరిగిందని వర్ధన్నపేట ఏసీపీ నరసయ్య మీడియా సమావేశంలో వెల్లడించారు.రాయపర్తి మండలం బురహాన్‌పల్లిలో గతనెల 7న మాజీ సర్పంచ్ సూదుల దేవేందర్ హత్యకు గురయ్యాడు. భూ తగాదాలు, వ్యక్తిగత కక్షల కారణంగా ఈ హత్య జరిగిందని.. ఈ హత్యలో పల్లె మల్లేశం అతడి కుమారుడు మురళి కీలకంగా వ్యవహరించి హైదరాబాద్‌కు చెందిన సుంకర ప్రసాద్, మర్నేని రాజు అనే సుపారి గ్యాంగ్ ద్వారా హత్య జరిగిందని పోలీసులు వెల్లడించారు.ఈ కేసులో మొత్తం ఎనిమిది మంది అరెస్ట్ కాగా, ఇందులో A1గా సుంకర ప్రసాద్ నాయుడు, A2 గా మర్నేని రాజు సహా మరో ఆరుగురిని అరెస్టు చేసినట్లు వర్ధన్నపేట ఏసీపీ తెలిపారు. -
మనిషిని పోలిన మనిషి.. ఆ ఊళ్లో 17 మంది ట్విన్స్..
సాక్షి, నర్సంపేట/రాయపర్తి(వరంగల్): ఒకే పోలిక.. అచ్చం ఒకరిని చూస్తే మరొకరిని చూసినట్లే.. జిరాక్స్ టూ జిరాక్స్, ఒకే డ్రెస్.. ఇట్లా చెప్పుకుంటూ పోతే కవలల గురించి ఎన్నో అంశాల్ని పోల్చి చెప్పవచ్చు. కవలలు ఎదురైతే ఆశ్చర్యంగా చూస్తాం. కొందరు తల్లిదండ్రులైతే ఒకే రకమైన డ్రెస్ కవలలిద్దరికీ వేస్తారు. కుటుంబ సభ్యులు సైతం గుర్తుపట్టేందుకు తటపటాయిస్తారు. అలా కవలలు ఎక్కడున్నా వారిది ప్రత్యేక స్థానమే. వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలోని పెర్కవేడు గ్రామంలో ఏకంగా 17 మంది కవలలు(34 మంది) ఉండడం విశేషం. నేడు అంతర్జాతీయ కవలల దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం. కవలల ఊరు! తెలంగాణలో ఏ ఊళ్లో లేనట్లుగా రాయపర్తి మండలం పెర్కవేడు గ్రామంలో ఎక్కువ మంది కవలలున్నారు. ఐదువేల జనాభా ఉన్న ఈ ఊళ్లో దాదాపు వెయ్యికి పైగా ఇండ్లుంటాయి. ఇక్కడ 17 మంది కవలుండడం విశేషం. కవలలు జన్మించడం చాలా అరుదు. కానీ ఇక్కడ ఎక్కువ మంది కవలలుండం ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. గ్రామంలోని కవలలు చదువులు, ఉద్యోగాలరీత్యా ఇతర ప్రాంతాలకు వెళ్లినప్పటికీ పండుగలకు, పబ్బాలకు మాత్రం గ్రామానికి వస్తుంటారు. అలా వచ్చినప్పుడు అందరి దృష్టి వీరిపైనే ఉంటుంది. వారిని గుర్తుపట్టడానికి. ఒకేలా తాతలు.. గొళ్లపల్లి రామయ్య, లక్ష్మయ్యలు కవలలు. వీరిది పెర్కవేడు. ఇద్దరూ వ్యవసాయ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ప్రస్తుతం ఒకరు కొండూరులో, మరొకరు స్వగ్రామంలో ఉంటున్నారు. చిన్నప్పటి నుంచి ఎప్పుడూ తాము గొడవపడలేదని చెబుతున్నారు. ఏ కార్యానికైనా కలిసికట్టుగా వెళ్తామని రాముడు, లక్ష్మణుడిలా ఒకరి మాట ఒకరు గౌరవించుకుంటామని చెబుతున్నారు రామయ్య, లక్ష్మయ్యలు. ఇప్పటికీ ఆ కుటుంబంలో ఐకమత్యానికి వీళ్లిద్దరినీ ఉదాహరణగా తీసుకుంటారు. చదవండి: కరీంనగర్: రూ.34 లక్షలు.. కాదు కాదు.. రూ.14లక్షలు...! కార్తీజన్వి– కృతిజన్వి నర్సంపేట మండలం మాధన్నపేట శివారు భోజ్యనాయక్ తండాకు చెందిన అజ్మీర విజయ్‌కుమార్–ప్రేమలత దంపతులకు 2016 డిసెంబర్లో కార్తిజన్వి–కృతిజన్వి జన్మించారు. వీరికి తల్లిదండ్రులు ప్రతీ రోజు ఒకే రకమైన డ్రెస్‌లు వేయడంతో ఇరుగుపొరుగు వారికి గుర్తు పట్టడం కూడా కష్టమే. వాణి–వీణ రాయపర్తి గ్రామానికి చెందిన దొడ్డ కృష్ణమూర్తి, సత్యవతికి రెండో సంతానంగా మానస(వాణి)మౌనిక(వీణ) జన్మించారు. మొదటి నుంచి ఇద్దరు చదువులో ముందుండేవారు. మానస(వాణి) ఎంఫార్మసీ పూర్తి చేసి హైదరాబాద్‌లో మెడికల్ కోడింగ్‌లో పని చేస్తోంది. మౌనిక(వీణ) బెంగళూరులో ఓప్రైవేట్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పని చేస్తోంది. ఇద్దరిలో ఎవరొకరు ఇంటికొచ్చినా ఇప్పటికీ కాలనీవాసులు గుర్తుపట్టడానికి ఇబ్బందులు పడతారు. ఫుర్ఖాన్–అఫాన్ నర్సంపేట పట్టణానికి చెందిన మహ్మద్ ఫయిజుద్దీన్ అరిఫాబేగం దంపతులకు మొదటి సంతానంలో కవలలు జన్మించారు. ఫుర్ఖాన్–అఫాన్ వీరిద్దరూ ఇంట్లో, బయటా ఐక్యంగా ఉంటారు. అభిరుచులు, అలవాట్లు కూడా ఒకేలా ఉంటాయని తల్లిదండ్రులు చెబుతున్నారు. అర్మన్‌షాహా–ఫర్మన్‌షాహా నర్సంపేటలో ఉపాధ్యాయుడు ఖాసీంషాహా హసీన దంపతుల కుమారులు అర్మన్‌షాహా–ఫర్మన్‌షాహా కవలలు. ఇద్దరూ ఒకే పోలికతో ఉండడంతో అందరిలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. కవలలు పుట్టడం తమ అదృష్టమని తల్లిదండ్రులు చెబుతున్నారు. చదవండి: ఆ ఆలోచనతో 30 శాతం మరణం ముప్పు తగ్గుతుంది: హార్వర్డ్ పరిశోధన ప్రత్యేక గుర్తింపు! మా గ్రామంలో ఇంతమంది కవలలు ఉండడం సంతోషం. ఒక్కోసారి ఆశ్చర్యంగా అనిపిస్తుంది. మా ఊళ్లో జన్మించిన కవలలు అంతా వేరే ఊళ్లల్లో పనులు చేసుకుంటున్నా.. పండుగల పూట గ్రామానికి వస్తారు. అలాంటి సమయంలో ఒక్కోసారి తికమకగా ఉంటుంది. ఒక ఊరిలో ఒకటి లేదా రెండు కవలల జంటలుంటాయి. కానీ మా ఊళ్లో ఏకంగా 17 కవలల జంటలున్నాయి. మా ఊరికి ఇదో ప్రత్యేక గుర్తింపుగా కూడా చెప్పవచ్చు. – చిన్నాల తారశ్రీరాజబాబు, సర్పంచ్, పెర్కవేడు -
తప్పిన పెను ప్రమాదం.. 60 మంది సేఫ్!
సాక్షి, రాయపర్తి : 60 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సుకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. బస్సు 11 కేవీ విద్యుత్ తీగలను తాకడంతో టైర్లు ఒక్కసారిగా పేలిపోయాయి. అదే సమయంలో విద్యుత్ తీగలు కూడా తెగిపడడంతో.. ట్రాన్స్ఫార్మర్ ఫీజు కొట్టేసి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఈఘటన వరంగల్ రూరల్ జిల్లా రాయపర్తిలో బుధవారం చోటుచేసుకుంది. వివరాలు.. రాయపర్తి మండలం తిరుమలయ్య పల్లి శివారులో పాలకుర్తి సీఐ వాహనం ఢీకొని దంపతులు బొమ్మకంటి రాజు (40), బొమ్మకంటి రాణి (33) మంగళవారం మృతి చెందిన విషయం తెలిసిందే. వారితో పాటు బైక్‌పై వెళ్తున్న రాణి సోదరి కవిత తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈనేపథ్యంలో.. తమకు న్యాయం చేయాలంటూ మృతుల కుటుంబ సభ్యులు వర్ధన్నపేట పట్టణ కేంద్రంలో వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై మృతదేహాలతో ధర్నాకు దిగారు. దీంతో ఆ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. రహదారికి రెండు వైపులా కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్‌తో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ క్రమంలో వరంగల్ నుంచి తొర్రూర్ వెళ్తున్న ఆర్టీసీ బస్సును.. డ్రైవర్ ఇరుకైన మార్గం గుండా పోనిచ్చేందుకు యత్నించాడు. ఆ పక్కనే ఉన్న విద్యుత్ వైర్లను డ్రైవర్ గమనించకపోవడంతో.. బస్సు 11 కేవీ విద్యుత్ తీగలకు తాకింది. విద్యుత్ ప్రసరించడంతో బస్సు టైర్లు ఒక్కసారిగా పేలిపోయాయి. విద్యుత్ తీగలు కూడా తెగిపోవడంతో.. ట్రాన్స్ఫార్మర్ ఫీజు కొట్టేసింది. దాంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం తెలుసుకున్న విద్యుత్ సిబ్బంది వెంటనే ఆ రూట్లో విద్యుత్ నిలిపివేయడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. డ్రైవర్ అజాగ్రత్తపై ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ఫేస్బుక్ బురిడీ
సాక్షి, రాయపర్తి: ఫేస్బుక్లో ప్రవేశపట్టిన బైక్‌బొమ్మను నమ్మి కొనుగోలు చేస్తానని చెప్పి ఆ వ్యక్తి అకౌంట్లో ఓ యువకుడు డబ్బులు వేసి మోసపోయిన సంఘటన మండలంలోని మైలారం శివారు చక్రుతండాలో బుధవారం చోటు చేసుకుంది. బాధితుడు గుగులోతు రాజేందర్ కథనం ప్రకారం ఫేస్బుక్లో రెండు లక్షల విలువైన కెటీఎమ్ ఆర్సీ–200 బైక్‌ను రూ80వేలకు అమ్మకం అని తాను ఆర్మీలో పని చేస్తానని తాను చేసే పనివద్ద నుంచి ట్రాన్స్ఫర్ అవ్వడంతో బైక్ అమ్ముతున్నట్లు ఫేస్బుక్లో చెప్పాడు. అంత విలువచేసే బైక్ అమ్ముతుండడం ఆశించిన తాను ఆ వ్యక్తిని సంప్రదించగా రూ70వేలకు కొనుగోలు చేస్తానని ఒప్పందం కుదుర్చుకున్నాను. సరే ముందుగా రూ30వేలు చెళ్లించాలని త ర్వాత ట్రాన్స్‌ఫోర్ట్ ద్వారా బైక్‌ను పంపిస్తానని చెప్పడంతో ఆన్లైన్ ద్వారా డబ్బులు చెళ్లించాడు. రెండురోజుల్లో డెలివరీ అవుతుందని చెప్పడంతో రెండురోజులుగా వేచి చూసినా ఫలితంలేదు. ఆర్మీక్యాంటిన్‌లో నీకు అమ్మిన బైక్ ఉందని జీఎస్టీ కట్టాలని ఇంకో రూ10వేలు కట్టాలని చెప్పడంతో పంపించాను. మళ్లీ రూ5వేలు పంపించాలని మెస్సేజ్ చేయడంతో మోసం అని గ్రహించి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు చెప్పాడు. ఎలాగైనా నిందుతున్ని పట్టుకొని డబ్బులు ఇప్పించాలని యువకుడు వేడుకుంటున్నాడు. -
అయ్యో దేవుడా..
ఆడుతూ పాడుతూ అల్లరి చేసే చిన్నారులు విగత జీవులుగా పడిపోవడం చూసి ఆ తల్లుల రోదనలు మిన్నంటాయి. ఎంత పనిచేశావు దేవుడా.. మా పిల్లల బదులు మమ్మలను తీసుకుపోలేకపోయావా.. మాకెందుకీ కడుపుకోత.. మేమేం పాపం చేశాం.. ముక్కుపచ్చలారని పిల్లలు పోయారే.. మాయదారి గుంత పాడుగాను.. మా పిల్లలు లేనిది మేం బతికేదెట్ల.. ఎవరికీ ఇలాంటి కష్టం రావొద్దని వారి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ కన్నీటి పర్యంతమయ్యారు. ఈ విషాద సంఘటన జిల్లాలోని రాయపర్తి మండలం మైలారం గ్రామంలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. – రాయపర్తి రాయపర్తి : మరుగుదొడ్డి గుంత ఇద్దరు చిన్నారుల ప్రాణాలను మింగింది. ఆడుతూ పాడుతూ అందరిని పలకరించే చిన్నారులు మృతిచెందారనే వార్త తెలియగానే గ్రామస్తుల రోదనలు మిన్నంటాయి. సరదాగా ఆడుకుంటూ మరుగుదొడ్డి కోసం తీసిన గుంతల్లో నిలిచిన నీళ్లలో పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందిన ఘటన మండలంలోని మైలారం గ్రామంలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన చిలువేరు సునీల్, శిరీష, లక్కం రాజు, స్వప్నలు దగ్గరి బంధువులు. లక్కం రాజు రెండేళ్ల క్రితం చనిపోవడంతో భర్త చనిపోయాడని స్వప్న తల్లిగారి ఊరైన మైలారంలోనే జీవిస్తోంది. వీరి పిల్లలు ఓ ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్నారు. ఒకరింటికి ఒకరు వెళ్లి ఆడుకుంటారు. సునీల్ ఇంటికి స్వప్న పెద్ద కుమారుడు అర్జున్(8) గురువారం సాయంత్రం ఆడుకుంటానికి వచ్చాడు. ఈ క్రమంలో చిలువేరు సునీల్, శిరీష దంపతుల పెద్ద కుమార్తె సాకృతతో(6)తో కలిసి ఆడుకుంటూ ఇంటి పక్కనే ఉన్న మరుగుదొడ్డి గుంతలో ఇద్దరు చిన్నారులు ప్రమాదవశాత్తు పడిపోయారు. ఈ విషయాన్ని ఎవరూ గమనించలేదు. సాయంత్రం కాగానే ఇరువురు పిల్లల తల్లిదండ్రులు పిల్లల కోసం వెతికారు. ఎక్కడా ఆచూకీ కనిపించకపోవడంతో చుట్టు పక్కల పరిసర ప్రాంతాలు వెతుకుతున్న క్రమంలో మరుగుదొడ్డి కోసం తీసిన గుంతలో చిన్నారుల మృతదేహాలు తేలియాడాయి. గుంతలోకి దిగి ఇద్దరిని బయటకు తీశారు. కంటికి రెప్పలా కాపాడుకున్న చిన్నారుల మృతదేహాలను చూసిన తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. గత ఏడాదిన్నర క్రితం మరుగుదొడ్డిని నిర్మించేందుకు గుంతలు తీయగా పక్కనే ఉన్న ప్రభుత్వ పాఠశాలలోని ట్యాంకుల నుంచి నీళ్లు ఇంకుతూ మరుగుదొడ్డి గుంతలు నిండాయి. ప్రమాదకరంగా ఉన్న గుంతలను తల్లిదండ్రులు పట్టించుకోకపోవడం ఈ విషాదానికి దారి తీసింది. -
కడియం, ఎర్రబెల్లి వాగ్వాదం
⇒ ఆంధ్రావాళ్ల మోచేతి నీళ్లు తాగుతున్నారన్న కడియం ⇒ నీవు ఆంధ్రా పార్టీలో పని చేయలేదా... కూర్చో అన్న ఎర్రబెల్లి రాయపర్తి: డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, టీటీడీపీ శాసనసభా పక్ష నేత ఎర్రబెల్లి దయాకర్‌రావుల మధ్య ఆది వారం వాగ్వాదం చోటు చేసుకుంది. వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలోని కాట్రపల్లి పెద్దచెరువు పూడికతీత పనుల సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి పనులను ప్రారంభించి మాట్లాడుతుండగా, ఎమ్మెల్యే దయాకర్‌రావు వచ్చారు. వెంటనే ఆయనను సభావేదికపైకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా దయాకర్‌రావు మాట్లాడుతూ మిషన్ కాకతీయను ఆహ్వానిస్తున్నామన్నారు. కానీ, పర్వతగిరి మండలంలోని ఏనుగల్లులో తనను దూషిస్తూ మాట్లాడడం సరికాదని కడియంను ఉద్దేశించి ఎర్రబెల్లి అన్నారు. తర్వాత దీనిపై డిప్యూటీ సీఎం కడియం మాట్లాడుతూ ‘ఏనుగల్లులో మాట్లాడింది నిజమే... అప్పుడు అదే మాట్లాడాను ఇప్పుడు అదే మాట్లాడుతున్నానన్నారు. తెలంగాణ ఏర్పాటయ్యాక ఇంకా ఆంధ్రావాళ్ల మోచేతినీళ్లు తాగుతూ ఉన్నవాళ్లు ఉన్నారని అన్నా’నని చెబుతుండగా వెంటనే ఎర్రబెల్లి లేచి ‘నీవు ఆంధ్రాపార్టీలో పని చేయలేదా.. ఏం మాట్లాడుతున్నావ్.. కూర్చో’ అన్నారు. ఈ క్రమంలో ఇద్దరూ వాగ్వాదానికి దిగారు. పక్కనే ఉన్న టీఆర్ఎస్ కార్యకర్తలు ‘జై తెలంగాణ’ అని నినాదాలు చేశారు. టీడీపీ పార్టీ కార్యకర్తలు ‘జై తెలుగుదేశం’ అని నినాదాలు చేయడంతో వాగ్వాదం నిలిచిపోయింది.