రాయపర్తి ఎస్‌బీఐలో బంగారం చోరీ కేసులో ముగ్గురి అరెస్ట్
కారులో పెట్రోల్ కోసం నాందేడ్‌లోని ఓ పెట్రోల్ బంక్‌లో యూపీఐ చెల్లింపులు
తెలంగాణ, మహారాష్ట్ర మీదుగా నకిలీ కారు నంబర్‌తోనే ప్రయాణం చేసిన దొంగలు
సాక్షి, వరంగల్: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండి యా (ఎస్‌బీఐ)లో 19 కిలోల బంగారం చోరీ కేసులో ముగ్గురు నిందితులను వరంగల్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. గత నెల 18వ తేదీ అర్ధరాత్రి చోరీ చేసిన ఉత్తరప్రదేశ్, మహా రాష్ట్రకు చెందిన ఏడుగురు సభ్యులతో కూడిన ముఠా కా రులో వరంగల్ మీదుగా హైదరాబాద్‌కు వెళ్లి అక్కడి నుంచి మహారా ష్ట్ర వెళ్లినట్టుగా పోలీసులు గుర్తించారు.
నాందేడ్‌లోని ఓ పెట్రోల్ బంక్‌లో ఇంధనం కోసం ఫోన్ పే ద్వారా ఆన్‌లైన్ చెల్లింపులు చేయడంతో ఆ ఫోన్ నంబర్ ఆధారంగా ఈ కేసును ఛేదించగలి గారు. తమపైన పోలీసుల నిఘా ఉందని తెలియడంతో తిరిగి తెలంగాణకు వచ్చిన వీరిని చాకచాక్యంగా పట్టుకొని 2.520 కిలోల బంగారు ఆభరణాలు, ఒక కారు, రూ.పదివేల నగదు స్వాధీనం చేసుకున్నారు.
రాజమండ్రిలోనే కుదిరిన స్నేహం
యూపీకి చెందిన మహమ్మద్ నవాబ్ హసన్, సాజిద్ ఖాన్‌లు అన్నదమ్ములు. వీరికి సమీప గ్రామస్తులైన అర్షాద్ అన్సారీ, షాఖీర్‌ఖాన్ ఆలియాస్ బోలెఖాన్‌లు స్నేహితులు. ఓ దొంగతనం కేసులో మహ్మద్ నవాబ్ హసన్, సాజిద్ ఖాన్‌లు రాజ మండ్రి జైలుకు వెళ్లారు. ఈ సమయంలోనే మహారాష్ట్రకు చెందిన హిమాన్షు బిగాం చండ్ జాన్వర్, సాగర్ భాస్కర్ గోర్, అక్ష య్ గజానన్ అంబోర్‌లతో పరిచయం ఏర్పడింది. 2024, ఫిబ్ర వరి 8న కాకినాడ జిల్లా పత్తిపాక ఎస్‌బీఐ బ్యాంక్‌లో రూ.30 లక్షల నగదు, కోటిన్నర విలువ చేసే బంగారం దోచుకెళ్లారు. సరిగ్గా 40 రోజుల క్రితం కర్ణాటకలోని ఓ ఎస్‌బీఐ బ్యాంక్ లో రూ12.95 కోట్ల విలువైన బంగారం దోచుకెళ్లారు. ఆ తర్వాత గత నెల 19న గూగుల్ మ్యాప్ ద్వారా రాయపర్తి ఎస్‌బీఐ లొకే షన్ గుర్తించడంతోపాటు అక్కడ భద్రతా సిబ్బంది లేకపో వడాన్ని రెక్కీ చేసుకొని నిర్ధారించుకున్నాకే దొంగతనం చేశారు.
రెండున్నర కిలోల బంగారం, కారు స్వాధీనం : వరంగల్ సీపీ
బంగారం చోరీ కేసులో ముగ్గురిని అరెస్టు చేశామని, మరో నలుగురి కోసం గాలిస్తున్నామని వరంగల్ పోలీసు కమిషనర్ అంబర్ కిశోర్ ఝా అన్నారు. వీరి నుంచి 2 కిలోల 520 గ్రా ముల బంగారం స్వాధీనం చేసుకున్నామన్నారు. పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు మహమ్మద్ నవాబ్ హసన్ రాయపర్తి మండల కేంద్రంలో ఎస్‌బీఐ బ్యాంక్ చోరీ అనువైనదిగా గుర్తించిన తర్వాతే ఈ బ్యాంక్‌లో బంగారం ఎత్తుకెళ్లారన్నారు. నవంబర్ 19న నిందితులు 3 బృందాలుగా విడిపోయి మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌కు తిరిగివెళ్లిపోయారు.
ఈ భారీ చోరీపై అప్రమత్త మై వెస్ట్‌జోన్ డీసీపీ రాజమహేంద్ర నేతృత్వంలోని వర్థన్న పేట ఏసీపీ నర్సయ్య, సీసీఎస్ ఏసీపీ భోజరాజు, నర్సంపేట ఏసీపీ కిరణ్ కుమార్‌ల ఆధ్వర్యంలో పదికిపైగా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితుల పట్టుకున్నామని సీపీ కిశోర్ ఝా తెలి పారు. అరెస్టయిన వారిలో అర్షాద్ అన్సారీ, షాఖీర్ ఖాన్ అలి యాస్ బోలెఖాన్, హిమాన్షు బిగాం చండ్ జాన్వర్ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment