ఫేస్‌బుక్‌ను నమ్మి వేరేవ్యక్తి అకౌంట్‌లో వేసిన బాధితుడు
సాక్షి, రాయపర్తి: ఫేస్‌బుక్‌లో ప్రవేశపట్టిన బైక్‌బొమ్మను నమ్మి కొనుగోలు చేస్తానని చెప్పి ఆ వ్యక్తి అకౌంట్లో ఓ యువకుడు డబ్బులు వేసి మోసపోయిన సంఘటన మండలంలోని మైలారం శివారు చక్రుతండాలో బుధవారం చోటు చేసుకుంది. బాధితుడు గుగులోతు రాజేందర్ కథనం ప్రకారం ఫేస్‌బుక్‌లో రెండు లక్షల విలువైన కెటీఎమ్ ఆర్‌సీ–200 బైక్‌ను రూ80వేలకు అమ్మకం అని తాను ఆర్మీలో పని చేస్తానని తాను చేసే పనివద్ద నుంచి ట్రాన్స్‌ఫర్ అవ్వడంతో బైక్ అమ్ముతున్నట్లు ఫేస్‌బుక్‌లో చెప్పాడు.
అంత విలువచేసే బైక్ అమ్ముతుండడం ఆశించిన తాను ఆ వ్యక్తిని సంప్రదించగా రూ70వేలకు కొనుగోలు చేస్తానని ఒప్పందం కుదుర్చుకున్నాను. సరే ముందుగా రూ30వేలు చెళ్లించాలని త ర్వాత ట్రాన్స్‌ఫోర్ట్ ద్వారా బైక్‌ను పంపిస్తానని చెప్పడంతో ఆన్‌లైన్ ద్వారా డబ్బులు చెళ్లించాడు. రెండురోజుల్లో డెలివరీ అవుతుందని చెప్పడంతో రెండురోజులుగా వేచి చూసినా ఫలితంలేదు. ఆర్మీక్యాంటిన్‌లో నీకు అమ్మిన బైక్ ఉందని జీఎస్టీ కట్టాలని ఇంకో రూ10వేలు కట్టాలని చెప్పడంతో పంపించాను. మళ్లీ రూ5వేలు పంపించాలని మెస్సేజ్ చేయడంతో మోసం అని గ్రహించి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు చెప్పాడు. ఎలాగైనా నిందుతున్ని పట్టుకొని డబ్బులు ఇప్పించాలని యువకుడు వేడుకుంటున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment