
కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్న సినీ దర్శకుడు ఆర్.నారాయణమూర్తి
విజయనగరం పూల్‌బాగ్ : విజయనగరం మండల పరిధిలోని సారిక పంచాయతీ మాజీ సర్పంచ్ మామిడి భవానీ మృతిపై సినీ నటుడు, దర్శకుడు, నిర్మాత ఆర్.నారాయణమూర్తి సంతాపం తెలిపారు. సారిక గ్రామానికి శుక్రవారం చేరుకుని భవానీ భర్త, ఏపీ పంచాయతీరాజ్ చాంబర్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మామిడి అప్పలనాయుడును పరామర్శించారు. పిల్లలు హాసిని, గ్రీష్మాలను ఓదార్చారు. ఆమె ఫొటోకు పూలమాలవేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
Comments
Please login to add a commentAdd a comment