జగిత్యాల జిల్లాలోఓ మాజీ సర్పంచ్ చర్య
18 లక్షలతో పంచాయతీ భవనం నిర్మించా.. సర్కారు బిల్లులు ఇవ్వక పోవటంతో అప్పులపాలయ్యా
తొంబరావుపేట మాజీ సర్పంచ్ సత్తమ్మ ధర్మారెడ్డి
మేడిపల్లి (వేములవాడ): చేసిన అభివృద్ధి పనులకు ప్రభుత్వం బిల్లులు విడుదల చేయకపోవటంతో ఓ మాజీ సర్పంచ్ గ్రామ పంచాయతీ భవనాన్ని తాకట్టు పెట్టిన ఘటన జగిత్యాల జిల్లాలో జరిగింది. మేడిపల్లి మండలం తొంబరావుపేట తాజా మాజీ సర్పంచ్ మామిడి సత్తమ్మ ధర్మారెడ్డి శుక్రవారం కట్లకుంట తెలంగాణ గ్రామీణ బ్యాంక్‌లో పంచాయతీకి సంబంధించి దస్త్రాలను తాకట్టు పెట్టడం చర్చనీయాంశంగా మారింది.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, సుమారు రూ.18 లక్షలకు పైగా అప్పు చేసి తొంబరావుపేట పంచాయతీ భవనం నిర్మించామని, ప్రభుత్వం నుంచి డబ్బులు రాకపోవటంతో అప్పుల ఊబిలో కూరుకుపోయామని వాపోయారు. అప్పు ఇచి్చనవారు రోజూ ఇంటికి వచ్చి వేధిస్తున్నారని తెలిపారు.
దీంతో అప్పులు తీర్చేందుకు లోన్ కోసం పంచాయతీ భవనాన్ని తాకట్టు పెట్టినట్లు చెప్పారు. ప్రభుత్వం బకాయిలు విడుదల చేసిన వెంటనే వడ్డీతో సహా బ్యాంకులో చెల్లిస్తానని సిబ్బందికి వివరించారు. తాకట్టు పెట్టేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు. తమకు వెంటనే ప్రభుత్వం బకాయిలు చెల్లించాలని లేకుంటే చావే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై బ్యాంకు అధికారిని సంప్రదించటానికి ప్రయతి్నంచగా అందుబాటులోకి రాలేదు.
Comments
Please login to add a commentAdd a comment