రాయచోటి: వైఎస్ఆర్ జిల్లా లక్కిరెడ్డిపల్లి మండలం పాలెం గ్రామంలో మాజీ సర్పంచ్ కుటుంబ సభ్యులపై దాడి జరిగింది. పాలెం మాజీ సర్పంచ్, వైఎస్సార్‌సీపీకి చెందిన చంద్ర కుటుంబంపై టీడీపీకి చెందిన ప్రస్తుత సర్పంచ్ వెంకటాద్రి, ఎంపీటీసీ గంగయ్య, మల్లేష్‌లు దాడి చేశారు. ఈ దాడిలో ఇద్దరు మహిళలకు గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. కాగా, చంద్ర స్థలాన్ని కబ్జా చేసేందుకు యత్నించగా అడ్డుకోవడంతో ఈ దాడి జరిగింది.
మాజీ సర్పంచ్ కుటుంబంపై దాడి
Published Wed, Nov 9 2016 10:03 AM | Last Updated on Fri, Aug 10 2018 9:46 PM
Advertisement
Advertisement