
గొల్లపల్లి(ధర్మపురి): రికార్డుల్లో పేరు పొందుపర్చనందుకు ఓ మాజీ సర్పంచ్ మహిళా వీఆర్వోను పంచాయతీ కార్యాలయంలో నిర్బంధించాడు. ఈ ఘటన జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలంలో జరిగింది. మల్లన్నపేట గ్రామంలో కొద్దిరోజులుగా రెవెన్యూ రికార్డుల శుద్ధీకరణ జరుగుతోంది. మాజీ సర్పంచ్ మానుక బక్కయ్య తన సోదరుడికి విక్రయించిన భూమి వివాదంలో ఉంది.
ఆ భూమిని తన పేరిట రికార్డుల్లో పొందుపర్చాలని బక్కయ్య కొద్ది రోజులుగా వీఆర్వో శ్రీలత వద్దకు వచ్చి కోరుతున్నాడు. అలా చేయడం తన పరిధి కాదని, ఉన్నతాధికారులకు అప్పీలు చేసుకుని సమస్య పరిష్కరించుకోవాలని సూచించారు. గురువారం మరోసారి వీఆర్వో వద్దకు వచ్చి తన పేరు చేర్చాలని ఒత్తిడి చేశాడు. వినకపోవడంతో పంచాయతీ గదిలో ఉంచి తాళం వేశాడు. వీఆర్వోపై దౌర్జ్జన్యానికి పాల్పడి విధులకు ఆటంకం కల్గించినందుకు బక్కయ్య పోలీసులు నాన్‌బెయిలబుల్ కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment