లక్నో: అలహబాద్ యూనివర్సిటీ తీవ్ర హింసాత్మకంగా మారింది. సెక్యూరిటీ గార్డు, విద్యార్థుల మధ్య వాగ్వాదం తలెత్తింది. దీంతో ఇరువురు ఘర్షణకు దిగడంతో యూనివర్సిటీలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. విద్యార్థులు రాళ్లు రువ్వడం, మోటారు సైకిళ్లుకు నిప్పంటించడం వంటివి చేశారు. ఈ ఘర్షణలో ఇరువురు తీవ్ర గాయాలపాలైనట్లు పోలీసులు పేర్కొన్నారు.
ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని, విద్యార్థులతో మాట్లాడుతున్నట్లు తెలిపారు. యూనివర్సిటీలో ఫీజుల పెంపు విషయమై నెలల తరబడి నిరసన జరుగుతోంది. అందులో భాగంగా ఓ విద్యార్థి నాయకుడు క్యాంపస్‌లోని బ్యాంకుకు వెళ్లాలనుకున్నాడు. ఐతే గార్డు అందుకు అనుమతించ లేదు. దీంతో వాగ్వాదం ఏర్పడి అది కాస్త ఘర్షణకు దారితీసినట్లు పోలీసులు పేర్కొన్నారు.
(చదవండి: జవాన్లకు ఆ పదం ఉపయోగించకూడదు! రాహల్‌పై విదేశాంగ మంత్రి ఫైర్)
Comments
Please login to add a commentAdd a comment