ఇప్పుడిప్పుడే సౌదీ మహిళలు తరతరాలుగా తమకు విధించిన ఆంక్షల నుంచి బయటపడుతూ వస్తున్నారు. క్రీడా పోటీలను వీక్షించడానికి స్టేడియాలకు వెళ్లే అనుమతి, డ్రైవింగ్ లైసెన్స్ ఇలా ఒక్కొక్కటిగా పొందుతూ వస్తున్నారు. ఈ సంచలనాత్మక నిర్ణయాలను సోషల్ మీడియా సైతం ఆహ్వానిస్తోంది. కానీ ఇప్పుడిప్పుడే ఆంక్షల నుంచి బయటపడుతున్నామని ఆశించిన సౌదీ మహిళలకు ఆ దేశం షాకిచ్చింది. మహిళలే సెంట్రాఫ్ అంట్రాక్షన్‌గా నిలిచే ఫ్యాషన్ షోల్లో, వారికి బదులుగా డ్రోన్లను ప్రవేశపెట్టింది. సౌదీ అరేబియా జిద్ధాలో జరిగిన ఫ్యాషన్ షోల్లో డిజైన్లను ప్రదర్శించడానికి ఒక్క మహిళా మోడల్ కూడా పాల్గొనలేదు. వారికి బదులుగా డ్రోన్ల ద్వారా వస్త్రాలను ప్రదర్శించారు. దీంతో ఈ ఫ్యాషన్ షో చాలా ఫన్నీగా ఉందంటూ కామెంట్లు వస్తున్నాయి.
ఈ ఫ్యాషన్ షోపై సోషల్ మీడియాలో పలువురు పలు అభిప్రాయాలను వెలువరిస్తున్నారు. ఇది చాలా భయానకంగా ఉందని, అధునాతన దుస్తులను దెయ్యాలు ధరించి ప్రదర్శిస్తున్నట్టు ఉందంటున్నారు. దెయ్యాల ఫ్యాషన్ షోగా అభివర్ణిస్తున్నారు. మరికొంత మంది దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సౌదీ అరేబియా మహిళల సాంప్రదాయిక దృక్పధంపై ఇది ప్రభావం చూపనుందని పేర్కొంటున్నారు. అయితే ఈ మాదిరి రియాక్షన్ వస్తుందని నిర్వాహకులు అసలు ఊహించలేదట. రంజాన్ నెలను దృష్టిలో ఉంచుకుని ఈ షోను ప్లాన్ చేసినట్టు తెలిసింది. కాగ, ఏప్రిల్‌లో జరిగిన తొలి ఫ్యాషన్ వీక్‌లో కూడా కేవలం మహిళా ప్రేక్షకులను అనుమతించారు. ఫీమేల్ మోడల్స్ ప్రదర్శించే వాటిని వారు మాత్రమే చూసేలా ఆ ఫ్యాషన్ షోను నిర్వహించారు.
This Saudi Arabian fashion show replaced all its models with drones, to eerie effect: https://t.co/bD4Z3xxWy6 pic.twitter.com/PR09QMbPBW
— Dazed (@Dazed) June 7, 2018
I’m dying at this fashion show in Saudi😂😂 they weren’t allowed female models pic.twitter.com/gkMt9bKQI8
— WORLDSTARHIPHOP (@WORLDSTARRCLIPS) June 8, 2018
Comments
Please login to add a commentAdd a comment