
బుల్లెట్ కుర్రాళ్లు
డుగుడుగుమనే శబ్దంతో నడిచే బుల్లెట్లు ఒకప్పుడు హల్‌చల్ చేశాయి. తమ దర్పాన్ని చాటే దిశగా ధనవంతులు వీటిని వాడేవారు.
తిరుపతి రూరల్, న్యూస్‌లైన్: డుగుడుగుమనే శబ్దంతో నడిచే బుల్లెట్లు ఒకప్పుడు హల్‌చల్ చేశాయి. తమ దర్పాన్ని చాటే దిశగా ధనవంతులు వీటిని వాడేవారు. పోలీస్ ఇన్‌స్పెక్టర్ వాహనం అంటేనే బుల్లెట్‌గా పేరు పడింది. డుగుడుగుమనే శబ్దం వినిపించిందటే ఇన్‌స్పెక్టర్ వచ్చేస్తున్నారనే భావనకు జనం వెళ్లిపోయేవారు. ఎంతో సందడి చేసిన బుల్లెట్లు కొంతకాలం కనుమరుగయ్యాయి. నేడు సరికొత్త హంగులతో రోడ్లపై పరుగులు తీస్తున్నాయి. యువత మనసు దోచుకుంటున్నాయి.
రాయల్ వచ్చిందిలా
రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇంగ్లాండ్‌కు చెందిన కంపె నీ. అప్పట్లో అక్కడి మిలటరీ అవసరాల కోసం దీన్ని బుల్లెట్ తయారు చేశారని చెబుతారు. తొలుత 1949లో భారత్‌లో వీటి అమ్మకాలు ప్రారంభమయ్యాయి. డిమాండ్ పెరగడంతో చెన్నైలో ఎన్‌ఫీల్డ్ ఇండియా కంపెనీ ప్రారంభించారు. 1992లో ఐచర్ కంపెనీవారు ఎన్‌ఫీల్డ్ ఇండియాను విలీనం చేసుకుని తిరిగి రాయల్ ఎన్‌ఫీల్డ్‌గా పేరు మార్చుకున్నారు.
మార్పులతో మార్కెట్‌లోకి..
పాత కాలం నాటి బుల్లెట్‌లకు నేటి వాహనాల కు ఎంతో తేడా ఉంది. అప్పట్లో బుల్లెట్‌కు సెల్ఫ్ స్టార్‌ట ఉండేది కాదు. అందుకే దీని కిక్ కొట్టాలంటే కండలు తిరిగిన శరీరం కలిగి ఉం డాలని భావించేవారు. కాలక్రమంలో బుల్లెట్‌లోనూ మార్పులు చోటు చేసుకున్నాయి. యు వతను ఆకట్టుకునేలా రూపురేఖలు మార్చా రు. యువత మెచ్చే రంగుల్లో, డిజైన్‌ల్లో బుల్లెట్‌లు ఆకర్షిస్తున్నాయి. సెల్ఫ్ స్టార్‌ట ప్రత్యేకత.
పాతవాటికి కొత్త మెరుగులు
ఒకప్పుడు రాయల్‌గా ఉన్న బుల్లెట్‌లు కొన్నేళ్ల క్రితం మూలనపడ్డాయి. నేడు మళ్లీ ట్రెండ్ మొదలవడంతో పాత వాహనాలకు మెరుగు లు దిద్ది రోడ్లపైకి తీసుకొస్తున్నారు. నికెల్ కోటింగ్ ఇచ్చి యువకులు మెచ్చే విధంగా సరి కొత్త హంగులతో కంపెనీలు సిద్ధం చేస్తున్నా యి. సెకండ్ హ్యాండ్ బండ్లకూ గిరాకీ ఉంది.
మోడల్స్ అదుర్‌స
ప్రస్తుతం రాయల్ ఎన్‌ఫీల్డ్ కంపెనీ 9 రకాల మోడళ్లను అందుబాటులోకి తెచ్చింది. 350 సీసీ, 500సీసీ, సెల్ఫ్ స్టార్‌ట పెట్రోల్ వాహనా లు, 350 సీసీ బేసిక్ బుల్లెట్‌లు, యూసీఈ, ఎలక్ట్రా, క్లాసిక్, థండర్‌వర్డ్ మోడళ్లు ఉన్నా యి. వీటి ధర రూ.1.10 లక్షల నుంచి 1. 40 లక్షల వరకు ఉంది. 500 సీసీ, బుల్లెట్, క్లాసిక్, థండర్‌వర్డ్, డేజర్డ్‌స్ట్రాం, క్రోం రూ.1.80 లక్షల నుంచి 1.90 లక్షల వరకు పలుకుతున్నాయి. ఇవి 150 నుంచి 200 కిలోమీటర్ల వేగంలో దూసుకెళ్లగలవు. గతంలో 700 సీసీ వరకు ఉండేవి. ప్రస్తుతం 500 సీసీ వరకే ఉన్నాయి.
పెరుగుతున్న డిమాండ్
బుల్లెట్‌లకు రోజురోజుకూ డిమాండ్ పెరుగుతోంది. జిల్లాలో ఏడేళ్ల క్రితం బుల్లెట్ కొనాలంటే మరో ప్రాంతానికి వెళ్లాల్సిందే. అయితే 2007వ సంవత్సరంలో ఎంఆర్.విజయ్‌కుమా ర్ చిత్తూరు రాయల్ ఎన్‌ఫీల్డ్ షోరూమ్‌ను ప్రారంభించారు. 2011లో తిరుపతిలో బ్రాం చ్ ఏర్పాటు చేశారు. జిల్లాలో మూడేళ్లుగా బుల్లెట్లకు డిమాండ్ పెరిగింది. ఏడాదిగా నెలకు 50 నుంచి 60 వాహనాలు అమ్ముడు పోతున్నాయి. బుక్ చేసుకున్న మూడు నెల లకు గానీ వాహనం ఇవ్వలేని పరిస్థితి. కంపెనీ నుంచి నెలకు 40 నుంచి 50 వరకు షోరూమ్‌కు వస్తున్నాయి. నెలకు బుకింగ్ 90 వాహనాలకుపైగా ఉన్నాయని షోరూం యజమాను లు చెబుతున్నారు.
మైలేజ్ పెరిగింది
గతంతో పోల్చుకుంటే బుల్లెట్‌లకు డిమాండ్ పెరిగింది. కొన్నేళ్ల క్రితం వరకు అంతగా అమ్మకాలు లేవు. ధైర్యం చేసి 2007లో షోరూం పెట్టాం. తొలినాళ్లలో ఒకట్రెండు మాత్రమే అమ్ముడుపోయేవి. అయితే ఏడాదిన్నరగా వీటి అమ్మకాలు బాగా పెరిగాయి. బుల్లెట్ ప్రత్యేకత, 50 కిలోమీటర్లకు పైగా మైలేజ్, డబుల్‌ప్లెగ్, రీసేల్, సెల్ఫ్‌స్టార్‌ట, స్ప్రింగ్ యాక్షన్ తది తర అంశాలు క్రేజ్‌ను పెంచాయి. ఎంఆర్.విజయ్‌కుమార్,
{పొప్రయిటర్, శ్రీసాయి మోటార్స్ తిరుపతి
బుల్లెట్ అంటే ఇష్టం
బుల్లెట్ అంటే చాలా ఇష్టం. ఇందులో వెళుతుంటే ఆ గమ్మత్తే వేరు. అందరి చూపు మనపైనే పడుతుంది. ఎన్ని రకాల బైక్‌లు వచ్చినా బుల్లెట్ బుల్లె ట్టే. నాన్నను అడగ్గానే వెంటనే కొని చ్చారు. ఎక్కడికైనా బుల్లెట్‌లోనే వెళుతున్నా. ఎంతో ఆనందంగా ఉంది.
- తేజ, తుమ్మలగుంట
అలసట ఉండదు
ఎంత దూర ప్రయాణమైనా బుల్లెట్‌లో వెళితే అలసట అని పించదు. బైక్ కంట్రోల్‌లో ఉం టుంది. అత్యవసరంగా వెళ్లేందు కు దోహదపడుతుంది. ఇక స్నేహితులతో కలిసి వెళ్లాలంటే ఆ అనుభూతే వేరు.
- సాయి, తిరుపతి
బుల్లెట్ మెకానిక్ అంటే ఆ క్రేజ్ వేరు
గతంలో బుల్లెట్ నడిపేవారికే కాదు మెకానిక్‌కూ మంచి హోదా ఉండేది. పేరుకు ముందు బుల్లెట్ అని వాడేవారు. ఇరవై ఏళ్ల ముందు బుల్లెట్ మెకానిక్‌కు డిమాండ్ ఉండేది. తర్వాత కష్టంగా మారింది. రెండేళ్లుగా మళ్లీ బుల్లెట్ యుగం వచ్చింది. నిత్యం న్యూ మాడ్యులేషన్‌తో బిజీగా ఉన్నాం. ఇరవై ఏళ్ల క్రితం జిల్లాలో 50 బుల్లెట్లే ఉండేవి. నేడు 8 వేలకుపైగా ఉన్నాయి. తిరుపతిలోనే 4వేల నుంచి 5వేలు ఉన్నాయి. రూ.1.50 లక్షలు పెట్టి వాహనం కొంటున్నారు. బుల్లెట్ బాబు నుంచి మెకానిజం నేర్చుకున్నాను. ఆయన మరణించాక 1983లో సొంతంగా షెడ్ పెట్టుకున్నాను.
-బుల్లెట్ కుమార్, బుల్లెట్ మెకానిక్, తిరుపతి