ఆడిషన్స్ అదుర్స్
మిస్ కాకినాడ 2016కు తరలివచ్చిన మోడల్స్
బోట్‌క్లబ్ (కాకినాడ) :
డ్రీమ్ మేకర్స్ ఈవెంట్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మిస్ కాకినాడ 2016 పోటీల్లో భాగంగా మంగళవారం స్థానిక ఎస్‌వీఎన్‌గ్రాండ్ హోటల్‌లో న్విహించిన ఆడిషన్స్ కార్యక్రమంలో మోడల్స్ ఉత్సాహంగా పాల్గొన్నారు. మోడల్స్ చేసిన క్యాట్‌వ్యాక్ అందరినీ అలరించింది. ఈ కార్యక్రమానికి న్యాయనిర్ణేతలుగా సినీ డైరక్టర్ క్రిష్, ఫ్యాషన్ డిజైనర్ అర్చన, శిరీషా వ్యవహరించారు. వారు మాట్లాడుతూ కేవలం మెట్రో నగరాలకే పరిమితమైన ఫ్యాషన్ షోలు ఇప్పుడు ద్వితీయ శ్రేణి నగరాలకు పరిచయం చేసేందుకు డ్రీమ్ మేకర్స్ ఈవెంట్ చేస్తున్న ప్రయత్నాన్ని వారు అభినందించారు. ఈవెంట్ ఆర్గనైజర్ శాంతి మాట్లాడుతూ డ్రీమ్ మేకర్స్ ఈవెంట్స్ ఎలాంటి ప్రతిఫలాపేక్షను ఆశించకుండా సామాజిక కార్యక్రమాలను నిర్వహణకు అవసరమైన నిధులు సమకూర్చేందుకు ఈ ఈవెంట్ నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఈనెల 25న రెండో విడత ఆడిషన్స్ నిర్వహిస్తామని ఆమె తెలిపారు. ఆసక్తిగలవారు సెల్ :70322 31139ను సంప్రదించి, తమ పేర్లను నమోదు చేసుకోవాలన్నారు.