
సాక్షి,హైదరాబాద్: భోజన ప్రియులుకు రుచికరమైన పుడ్‌ని అందించేందుకు సివిల్ గ్రూప్ అతిధి దేవోభవ రెస్టారెంట్ని కొత్తపేట నుంచి నాగోల్ మార్గమధ్యంలో అందుబాటులోకి తీసుకువచ్చారు. అతిథి దేవో భవ రెస్టారెంట్‌ను డిప్యూటి స్పీకర్ పద్మారావు గౌడ్, కార్పొరేటర్స్ వెంకట నర్సింహ, పవన్ కుమార్, ప్రేమ్ మహేష్, సామల హేమ, కండి శైలజ, సినీనటులు సర్లీన్ కౌర్, ఫారీదా యూసఫ్ మోడల్స్ కలసి కొత్తపేటలో ప్రారంభించారు.
ఈ సందర్భంలో సినీనటిలు మాట్లాడుతూ విభిన్న ఆహార రుచులను అందించేందుకు హైదరాబాద్ కేరాఫ్ గా నిలుస్తుందని అన్నారు. తనకు మటన్, చికెన్ చాలా ఇష్టం అన్ని చెప్పారు. రెస్టారెంట్ నిర్వాహకులు మహిచంద్ మాట్లాడుతూ త్వరలో బ్యాంకుట్ హాల్, రూమ్స్ కూడా అందుబాటులోకి తెస్తామని చెప్పారు. రెస్టారెంట్ డిజైన్ ధీమ్ ప్రత్యేకమని డైనింగ్ సెటఫ్‌లో కూర్చునే ఆహార ప్రియులకు ఫుడ్ సర్వ్ చేయనున్నట్లు తెలిపారు.