న్యూఢిల్లీ: WWDC 2023లో టెక్ దిగ్గజం యాపిల్‌కొత్త ఉత్పత్తులను లాంచ్ చేసింది. ముఖ్యంగా యాపిల్ ఐఫోన్ ఆపరేటింగ్ సిస్టం 17 లేటెస్ట్ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌ను ప్రకటించింది. దీంతోపాటు 16 ఆపరేటింగ్ సిస్టంపై మరిన్ని అప్‌డేట్స్ ప్రకటించింది. లేటెస్ట్ iOS సాఫ్ట్‌వేర్ నుంచి మల్టీ హార్డ్‌వేర్ ప్రొడక్టుల వరకు కంపెనీ మొట్టమొదటి మిశ్రమ రియాలిటీ హెడ్‌సెట్ విజన్ ప్రోగా పిలుస్తోంది.
ఐవోఎస్ 17 అందుబాటులో ఉండే ఐఫోన్‌ల జాబితాను కూడా కంపెనీ వెల్లడించింది. ఈ లిస్ట్‌లో 3 పాపులర్ ఐఫోన్ మోడల్స్ ను తొలగించింది. సంస్థ ప్రకటించిన అధికారిక జాబితా ప్రకారం యాపిల్ ఎక్స్ఎస్, తరువాత మోడల్స్‌ను దీనికి అప్‌డేట్ చేసుకోవచ్చు. అలాగే ఐవోఎస్ 17 అప్‌డేట్ లేని ఐఫోన్లలో క్రిటికల్ లోపాన్ని సవరించేందుకు స్పెషల్ సెక్యూరిటీ అప్‌డేట్స్ ఇవ్వనున్నట్టు ప్రకటించింది.
ఇది ప్రస్తుతం డెవలపర్ ప్రోగ్రామ్ సభ్యులకు అందుబాటులో ఉంది. అద్భుతమైన ఫీచర్లతో వస్తున్న ఈ వెర్షన్ వచ్చే నెలలో ఈ ఏడాది సెప్టెంబరు నాటికి లాంచ్ కానుందని అంచనా. IOS 17 సపోర్ట్‌తో యాపిల్ మిక్స్డ్ రియాలిటీ హెడ్‌సెట్‌ను కూడా పరిచయం చేసింది.
ఐవోఎస్ 17 అప్‌డేట్‌ను పొందని ఐఫోన్లు
ఐఫోన్ X
iPhone 8
ఐఫోన్ 8 ప్లస్
iPhone SE ఫస్ట్ జెన్
Comments
Please login to add a commentAdd a comment