
Kolkata Model Pooja Sarkar Suicide After Boyfriend Call: ఇటీవల కాలంలో సినీ ఇండస్ట్రీలో తరచుగా విషాదం నెలకొంటోంది. అనారోగ్య సమస్యలతో కొందరు మరణిస్తే, ఆత్మహత్యలకు పాల్పడుతూ పలువురు తనువు చాలిస్తున్నారు. వీరిలో కొందరు మోడల్స్ సైతం ఉంటున్నారు. తాజాగా కోల్‌కతాలో పూజా సర్కార్ (21) అనే మోడల్ విగతజీవిగా కనిపించింది. తను నివసిస్తున్న అద్దె ఇంట్లో ఉరివేసుకోని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
పూజా సర్కార్ నార్త్ 24 పరగణాస్ జిల్లాలో మొదటి సంవత్సరం చదువుతోంది. సౌత్ కోల్‌కతాలోని బాన్స్‌ద్రోని ప్రాంతంలో నివసిస్తోంది. శనివారం (జులై 16) సాయంత్రం తన ఫ్రెండ్స్‌తో కలిసి ఓ రెస్టారెంట్‌కు వెళ్లింది పూజా. రెస్టారెంట్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత పూజాకు ఒక కాల్ వచ్చింది. దాని తర్వాత గదిలోకి పరిగెత్తి లోపలి నుంచి తాళం వేసుకున్న పూజా.. ఆమె ఫ్రెండ్స్ ఎంత ప్రయత్నించినా తలుపు తీయలేదు. దీంతో పూజా స్నేహితులు పోలీసులకు సమాచారం అందించారు. రంగప్రవేశం చేసిన పోలీసులు తలుపులు పగలగొట్టి చూడగా పూజా సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని కనిపించింది. అయితే ఆమె చనిపోవడానికి ముందు తన బాయ్‌ఫ్రెండ్ నుంచి కాల్ వచ్చిందని పూజా స్నేహింతులు పోలీసులకు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు.
చదవండి: ఆ వార్త నన్ను కలిచివేసింది: సుష్మితా సేన్ తమ్ముడు
బికినీలో రచ్చ చేస్తున్న 'బ్యాచ్‌లర్' హీరోయిన్..
కాగా గత మూడు నెలల్లో ముగ్గురు మోడల్స్ బలవన్మరణం చెందారు. బిదిషా డే మజుందార్ అనే కోల్‌కతా మోడల్ మే 24న డమ్‌డమ్‌లోని తన ఫ్లాట్‌లో ఉరివేసుకుని చనిపోయింది. తర్వాత పరిశ్రమలోని బిదిషా స్నేహితురాలు మోడల్ మంజుషా నియోగి కూడా మే 27న పటులిలో ఆత్మహత్య చేసుకుంది. ఈ మోడల్స్ ఇద్దరూ రిలేషన్‌షిప్‌తోపాటు సరైనా అవకాశాలు రాకపోవడం, ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నట్లు సమాచారం.
చదవండి: పెళ్లి చేసుకోబోతున్న బుల్లితెర బ్యూటీ!.. ఫొటోలు వైరల్
పిల్లలు వద్దనుకోవడంపై ఉపాసన క్లారిటీ..
(మనిషికి ఉండేది ఒక్కటే జీవితం. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ధైర్యంగా జీవితంలో ముందుకు సాగండి..
రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001
మెయిల్: roshnihelp@gmail.com)
Comments
Please login to add a commentAdd a comment