పింక్‌ డ్రస్‌లో మిల్కీ బ్యూటీ..ధర వింటే షాకవ్వుతారు! | Tamannaah Bhatia In This Rs 4 Lakh Versace Gown Keeps | Sakshi
Sakshi News home page

పింక్‌ డ్రస్‌లో మిల్కీ బ్యూటీ..ధర వింటే షాకవ్వుతారు!

Published Wed, Mar 20 2024 6:18 PM | Last Updated on Wed, Mar 20 2024 6:25 PM

Tamannaah Bhatia In This Rs 4 Lakh Versace Gown Keeps - Sakshi

మిల్కీబ్యూటీ తమన్నా భాటియాకి ఇప్పటికీ టాలీవుడ్‌లో మంచి క్రేజ్‌ ఉంది. కానీ బాహుబలి తర్వాత ఆమెకు సరైన హిట్‌ పడలేదు. ఒకప్పుడూ ఆమె టాలీవుడ్‌లో మంచి డిమాండ్‌ ఉన్న హీరోయిన్‌. ఆ టైంలో ఓ పక్క స్టార్‌ హీరోలతో నటిస్తూనే యంగ్‌ హిరోలతో కూడా నటించేది ఈ భామ. అయితే ఆమె కెరీర్‌లో హిట్‌ల కంటే ప్లాప్‌లే ఎక్కువ ఉన్నాయి. అయితేనేం ఆమె అందం, పర్సనల్‌ ఇమేజ్‌తో ప్రేక్షకుల ఆదరణ పొందుతూనే ఉంది. 

ఈ మధ్యకాలంలో గ్లామర్ డోస్ పెంచి వివిధ హాట్ ఫోటోషూట్లతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఒకప్పుడు టాలీవుడ్‌లో నెంబర్ వన్ స్థానంలో ఉండేది. ప్రస్తుతం స్పీడ్ తగ్గించి బాలీవుడ్ వెబ్‌ సిరీస్‌లపై దృష్టిపెట్టింది. ఈమధ్య ప్రతి రోజూ ఓ డిఫరెంట్ డ్రెస్ లో స్టన్నింగ్ లుక్స్ తో కనిపిస్తోంది తమన్నా భాటియా. ముఖ్యంగా బాలీవుడ్, వెబ్ సిరీస్లతో బిజీ అయిన తర్వాత తమన్నా తన గ్లామర్ డోసు అమాంతం పెంచేసింది. తాజాగా పింక్ డ్రెస్లో అభిమానుల మనసులు గెలుచుకుంటోంది.

తమన్నా ధరించిన ఈ డ్రెస్‌  లగ్జరీ వర్సెచె బ్రాండ్‌కి చెందింది. డ్రస్‌ ధర ఏకంగా రూ. 4.2 లక్షలు. ఈ పింక్‌ కలర్‌ లగ్జరియస్‌ డ్రెస్‌లో బార్బీ బొమ్మలా మెరిసిపోయింది. ఇన్‌స్టాగ్రాంలో అందుకు సంబంధించని ఫోటోలను షేర్‌ చేస్తూ తన అభిమానులకు ట్రీట్‌ ఇస్తోంది. వీటికి ఓన్లీ ఫ్లవర్‌ ఎమోజీలతో క్యాప్షన్‌ ఇచ్చి పోస్ట్‌ చేసింద. ఈ పింక్‌ డ్రస్‌లో తమన్నా ఫోటోలకు ఇచ్చిన ఫోజులు అదిరిపోయాయి. 

(చదవండి: రైల్లో వస్తువులు మర్చిపోతే ఏం చేయాలో తెలుసా?)


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement