An Elderly Couple Walking Out Of Theatre By Holding Hands After Watching Barbie, Video Goes Viral - Sakshi
Sakshi News home page

Elderly Couple Viral Video: ‘బార్బీ’ ఫీవర్‌.. సినిమా చూసేందుకు థియేట‌ర్‌కు వ‌చ్చిన వృద్ధ జంట‌.. చివరిలో

Published Sat, Aug 5 2023 4:42 PM | Last Updated on Sat, Aug 5 2023 6:13 PM

Elderly Couple Walking Out Of Theatre After Watching Barbie - Sakshi

బార్బీ.. బార్బీ..  ప్రపంచవ్యాప్తంగా సీనీ అభిమానులను నోట ప్రస్తుతం ఇదే మాట. గ్రెటా గెర్విగ్ తెర‌కెక్కించిన బార్బీ చిత్రం విడుదలైన అన్ని చోట్ల పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకుని రికార్డ్‌ వసూళ్లను రాబడుతోంది. ఈ సినిమా చూసిన వాళ్లంతా ‘బార్బీ’ మూవీ సూపర్‌ అంటూ కితాబు ఇవ్వడంతో విశేష స్పంద‌న ల‌భిస్తోంది. ఇక సోషల్‌ మీడియాలో బార్బీ ఫీవర్‌ మామూలుగా లేదనే చెప్పాలి. ఎక్కడ చూసిన పింక్‌ కలర్‌తో నింపుతున్నారు నెటిజన్లు.  

ఈ చిత్రాన్ని చూసేందుకు అన్ని వ‌య‌సుల వారూ థియేట‌ర్ల‌కు క్యూ క‌డుతున్న సంగతి తెలిసిందే. తాజాగా బార్బీ మూవీని చూసేందుకు వృద్ధ దంప‌తులు రాగా.. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. అందులో.. ఓ వృద్ధ దంపతులు సినిమా పూర్తయిన తర్వాత ఒక‌రి చేతిలో ఒకరు చేయి వేసి థియేట‌ర్ నుంచి బ‌య‌ట‌కు వ‌స్తుండ‌టం క‌నిపిస్తుంది. 

ఈ వీడియోని ష‌కీనా అనే యూజ‌ర్ టిక్‌టాక్‌లో పోస్ట్ చేస్తూ.. బార్బీతో పాటు వీరిని చూసిన త‌ర్వాత కంట‌నీరు రాకుండా ఉండ‌ద‌ని పోస్ట్కు క్యాప్ష‌న్ ఇచ్చారు. ఈ క్లిప్ ఇప్పుడు నెట్టింట సంద‌డి చేస్తోంది. "బార్బీ" చిత్రం జూలై 21న విడుదలైనప్పటి నుండి ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. మార్గోట్ రాబీ, ర్యాన్ గోస్లింగ్, దువా లిపా, సిము లియు, అరియానా గ్రీన్‌బ్లాట్, మైఖేల్ సెరా మరియు ఎమ్మా మాకీ నటించారు.

     The old couple after the Barbie movie
by      u/gamesofduty in      MadeMeSmile    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement