ప్రేమంటే పడని కుర్రాడి కథ
ప్రేమంటే పడని కుర్రాడి కథ
Published Mon, Oct 21 2013 12:44 AM | Last Updated on Tue, Aug 28 2018 4:30 PM
ఇండియన్ ఐడల్ శ్రీరామచంద్ర కథానాయకునిగా రూపొందుతోన్న చిత్రం ‘ప్రేమా గీమా జాన్‌తా నై’. బార్బీ కథానాయిక. సుబ్బు ఆర్వీ దర్శకుడు. మద్దాల భాస్కర్, బాల భాస్కర్ నిర్మాతలు. ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటోంది. మణిశర్మ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను ఈ నెలాఖరున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
నిర్మాతలు మాట్లాడుతూ-‘‘నవ్యమైన ప్రేమకథతో రూపొందుతోన్న చిత్రమిది. యూత్‌ని ప్రభావితం చేసే అంశాలు ఇందులో ఉంటాయి. ప్రియాంక చోప్రా మేనకోడలు బార్బీహండ హీరోయిన్‌గా, మహానటుడు ఎస్వీరంగారావు మనవడు జూనియర్ ఎస్వీఆర్ విలన్‌గా ఈ చిత్రం ద్వారా పరిచయం అవుతుండటం విశేషం. వచ్చే నెలలో సినిమాను విడుదల చేస్తాం’’ అని తెలిపారు.
ప్రేమంటే పడని ఓ కుర్రాడు ప్రేమలో పడ్డాక తన అభిప్రాయాన్ని ఎలా మార్చుకున్నాడు? అనే కథాంశంతో తెరకెక్కుతోన్న చిత్రమిదని, ఇందులోని ప్రేమ సన్నివేశాలు కొత్తగా ఉంటాయని దర్శకుడు చెప్పారు. ఈ చిత్రానికి కూర్పు: మార్తాండ్ కె.వెంకటేష్, కార్యనిర్వాహక నిర్మాత: ఎం.ఎస్.కుమార్.
Advertisement
Advertisement