బొమ్మలు... కాదు భామలు!
అందం ఇనుమడించడం కోసం సినీతారలు, సెలబ్రిటీలు ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకోవటం సర్వసాధారణమై పోయింది. సహజ సిద్ధమైన శరీరాకృతిని భిన్నంగా తీర్చి దిద్దుకుని ప్రత్యేకాకర్షణగా నిలిచేందుకు తాపత్రయ పడుతుంటారు. మనదేశంలో హీరోయిన్లు అందం కోసం ప్లాస్టిక్ సర్జరీలను ఆశ్రయించడం సర్వ సాధారణమైపోయింది. కొందరు ముక్కు, మరికొందరు పెదాలకు ఇలా శరీరభాగాలకు సర్జరీ చేయించుకొని అందాలను ఆరబోస్తున్నారు. అయితే సర్జరీ అవసరం లేకుండానే బార్బీ బొమ్మల్లా కనిపిస్తున్నారు వివిధ దేశాల్లోని కొందరు అమ్మాయిలు. అదెలాగో చూద్దాం.
సహజ శరీరాకృతిని, ముఖ వర్చస్సును మార్చుకుని బార్బీల్లా కనిపించేందుకు కొందరు యువతులు తీవ్రంగానే కృషి చేస్తున్నారు. ఉక్రెయిన్ కు చెందిన ష్పాజినా అనే యువతి ప్లాస్టిక్ సర్జరీ లేకుండానే బార్బీ బొమ్మలా కనిపిస్తూ ఆకట్టుకుంటోంది. అందుకు కేవలం బరువు తగ్గి, మేకప్ వేసుకోవడంలో ఎంతో శ్రద్ధ చూపిస్తోందట. సన్నని తీగలాంటి శరీరం, బొమ్మలాంటి ఆకృతిలో ఏకంగా తన స్వరూపాన్నే మర్చేసుకొని కదిలే బార్బీలా మారిపోయింది.
సర్జరీల్లేకుండానే ప్లాస్టిక్ డాల్స్ లా మారిన ఆరుగురు అమ్మాయిల్లో మరొక యువతి లక్యానోవా. ఉక్రెయిన్ కు చెందిన ఆమె అసలు ఏమాత్రం సర్జరీ జోలికి పోకుండానే బార్బీలా మారింది. కేవలం మేకప్ తో పాటు, కలర్ లెన్స్ వాడుతూ తన రూపాన్నే మార్చేసుకొందట ఆ బార్బీ గాల్.
అలాగే రష్యన్ బార్బీగా పిలిపించుకుంటున్న అంజెలికా కెనోవా కనీసం ఆపరేటింగ్ రూమ్ దరిదాపులకు కూడ వెళ్ళకుండానే ప్లాస్టిక్ బొమ్మలా దర్శనిమిస్తోందట. ఉక్రెయిన్ కు చెందిన పదహారేళ్ళ లోలితా రిచి, పదమూడేళ్ళ అలినా కోవలేవ్సాయ కూడా శస్త్ర చికిత్సల్లేకుండానే కదిలే బార్బీ బొమ్మల్లా కనిపిస్తూ ఆకట్టుకుంటున్నారు. ఇక బ్రిటిష్ వీనస్ పలెర్మో అయితే తన బొమ్మలాంటి లక్షణాలతో జపాన్ లోని జనాన్ని ముగ్ధులను చేస్తోందట.