బుల్లెట్.. ఫేవరేట్.. | my favourite bike is Bullet | Sakshi
Sakshi News home page

బుల్లెట్.. ఫేవరేట్..

Published Sun, May 18 2014 12:59 AM | Last Updated on Sat, Sep 2 2017 7:28 AM

బుల్లెట్.. ఫేవరేట్..

బుల్లెట్.. ఫేవరేట్..

యడ్లపాడు, న్యూస్‌లైన్ :ఆ సౌండే వేరు.. ఆ లుక్కే వేరు.. దాన్ని నడుపుతుంటే వచ్చే కిక్కేవేరు.. అంటారు బుల్లెట్ నడిపేవారు. ద్విచక్రవాహనాల్లో రారాజు లాంటిదే ఈ బుల్లెట్ అని కితాబిచ్చేస్తారు. మూడు దశాబ్దాల కిందట బుల్లెట్ కొనడం గొప్పగా భావించేవారు. అది హుందాతనానికి ప్రతీక గా ఉండేది. తరం మారినా ఈ వాహనంపై మోజు తగ్గలేదు. పైగా నేటి యువత రాన్ని మరింత ఆకర్షిస్తోంది. ద్విచక్రవాహన కంపెనీలు ఈ వాహనాల ఉత్పత్తులను కూడా పెంచాయి. అదలా ఉంచితే.. సుమారు నాలుగు దశాబ్దాల కిందట తయారు చేసిన బుల్లెట్ ఎక్కడైనా కనిపిస్తే ఎంతో ఆసక్తిగా చూస్తాం. అప్పుడు కొన్న రాయల్ బుల్లెట్ ఓ వ్యక్తి ఇప్పటివరకు వాడుతున్నారు. తాను బుల్లెట్ అభిమానిని అని గర్వంగా చెప్పుకొంటున్నారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..

‘నాపేరు లావు నర్శింహారావు. నాకు 72 సంవత్సరాలు. మాది యడ్లపాడు మండలంలోని జాలాది గ్రామం. భార్య ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. నా యుక్తవయస్సులో అంతా మార్చురేస్ వాహనాలు ఎక్కువగా మార్కెట్‌లో లభించేవి. ఇవి ఇంగ్లాండ్ నుంచి మన దేశానికి దిగుమతి అయ్యేవి. 1950 తర్వాత స్వదేశంలోనే బుల్లెట్ తయారీ ప్రారంభమైంది. ఆంధ్ర, మద్రాసు సంయుక్త రాష్ట్రాలుగా ఉన్న సమయంలో మద్రాసులో ఎన్‌ఫీల్డ్ కంపెనీ ఆవిర్భావించింది. ఇక్కడ రాయల్ ఎన్‌ఫీల్డ్, ఎజ్డీ జావాలను ఉత్పత్తి చేసేవారు.  ఎజ్డీ జావా అయితే కేవలం 2.5 హార్స్‌పవర్, అదే రాయల్ బుల్టెట్ అయితే 3.5 హార్స్‌పవర్ ఉండేది. నా ఇరవైఏడేళ్ల వయసులో 1968 నవ ంబర్ 22న విజయవాడ పద్మజ కమర్షియల్ కార్పొరేషన్‌లో రాయల్ బుల్లెట్ కొన్నాను.

అప్పటినుంచి ఇదే వాహనాన్ని నడుపుతున్నాను. ఇది వేగంతో పాటుగా ఎంతో సౌకర్యవంతంగా, హుందాతనంగా ఉంటుంది. అందుకే బుల్లెట్ ఫేవరేట్‌గా మారిపోయాను. వాహనం కొన్న మొదట్లో లీటరు పెట్రోలు కేవలం ముప్పావలా. ప్రస్తుతం రూ.82కు పెరిగింది. అందుకే కొంతకాలం క్రితం పెట్రోలు నుంచి డీజిల్ వాహనంగా మార్పు చేయించాను. ఎగుడుదిగుడు గ్రామీణ రోడ్లలో ఈ బుల్లెట్ ఎటువైపు వాలకుండా నిటారుగా ఉంటుంది. చిన్నచిన్న రాళ్లు టైరు కిందపడినా, బురదలో నడిపినా త్వరగా స్కిడ్ కాదు. ఎంతదూరం ప్రయాణించినా ప్రయాణ బడలిక, అలసట కన్పించదు. అందుకే రాయల్ బుల్లెట్.. నా ఫేవరేట్..!
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement