చూపులో సైకిల్‌.. రేటులో బుల్లెట్‌  | Furniture Dealer From Kakinada Bought Bicycle From Italy | Sakshi
Sakshi News home page

చూపులో సైకిల్‌.. రేటులో బుల్లెట్‌ 

Published Sun, Dec 18 2022 2:07 PM | Last Updated on Sun, Dec 18 2022 2:14 PM

Furniture Dealer From Kakinada Bought Bicycle From Italy - Sakshi

సాక్షి, ఫిఠాపురం: చూడటానికి అది సైకిలే కానీ రేటులో మాత్రం బుల్లెట్‌తో పోటీ పడుతోంది. సామాన్యుడి వాహనం సైకిల్‌ అసామాన్యంగా మారిపోయింది. కాకినాడకు చెందిన ఓ ఫర్నిచర్‌ వ్యాపారి తన కుమారుడు చైతన్య కోసం ఏకంగా విదేశాల నుంచి సైకిల్‌ కొనుగోలు చేశారు. ఇటలీకి చెందిన ఈ సైకిల్‌ రేటు అక్షరాలా రూ.1.40 లక్షలు.

మోటారు సైకిల్‌ మాదిరిగా రిజిస్ట్రేషన్‌ నంబరుతో పాటు లైసెన్సు కలిపి అంత ధర అయ్యిందని చెబుతున్నారు. చూడటానికి మామూలు సైకిల్‌లానే ఉన్నా నిర్మాణంలో కొత్తదనం కనిపిస్తోంది. బుల్లెట్‌ బండి రేటుతో పోటీ పడుతున్న ఈ సైకిల్‌ ప్రస్తుతం పిఠాపురం రోడ్డులో ఆకర్షణగా నిలుస్తోంది.    

(చదవండి: రిపోర్ట్‌లో అసలు గుట్టు.. మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని..)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement