బుల్లెట్‌ బాబు..70 చలాన్లు! | Bullet Bike Seized With 70 Pending Challans Hyderabad | Sakshi
Sakshi News home page

బుల్లెట్‌ బాబు..70 చలాన్లు!

Published Tue, Jul 9 2019 7:44 AM | Last Updated on Sat, Jul 13 2019 11:11 AM

Bullet Bike Seized With 70 Pending Challans Hyderabad - Sakshi

వాహనం పెండింగ్‌ చలానాల లిస్టును చూసిస్తున్న ట్రాఫిక్‌ ఎస్సై రమేష్‌

నల్లకుంట: నగరంలోని వివిధ ప్రాంతాల్లో ట్రాఫిక్‌ రూల్స్‌ అతిక్రమణకు సంబంధించి 77 పెండింగ్‌ చలానాలు ఉన్న ఓ ద్విచక్ర వాహనం నల్లకుంట ట్రాఫిక్‌ పోలీసులు చిక్కింది. వివరాల్లోకి వెళితే.. స్పెషల్‌ డ్రైవ్‌లో భాగంగా సోమవారం నల్లకుంట ట్రాఫిక్‌ పోలీసులు ఎస్సై రమేష్‌ నేతృత్వంలో ఫీవర్‌ ఆస్పత్రి చౌరస్తా సమీపంలో వాహన తనిఖీలు చేపట్టారు. అదే సమయంలో జుజ్జువారపు సువర్ణరాజు తన బుల్లెట్‌ (టీఎస్‌ 07ఎఫ్‌హెచ్‌ 1245) వాహనంపై శంకరమఠం నుంచి ఫీవర్‌ ఆస్పత్రి వైపు వెళ్తుండగా పోలీసులు ఆపారు.

తమ వద్ద ఉన్న ట్యాబ్‌లో ఆ బండి నెంబర్‌తో చెక్‌ చేయగా ఆ వాహనంపై మొత్తం 77 చలానాలు పెండింగ్‌లో ఉన్నాయి. ఆ చలానాలకు సంబంధించి బకాయిలు రూ.12,725 ఉండటంతో ఎస్సై రమేష్‌ ద్విచక్రవానహనాన్ని స్వాధీనం చేసుకుని స్టేషన్‌కు తరలించారు. ఈ విషయాన్ని సీఐ రాజేంద్ర కులకర్ణికి తెలియజేయడంతో ఆయన   నగర పోలీసు కమిషనరేట్‌కు సమాచారం ఇచ్చారు. పెండింగ్‌ చలానాలు క్లియర్‌ చేస్తే వాహనాన్ని అప్పగిస్తామని ఎస్సై చెప్పారు. కాగా .. పెండింగ్‌ చలానాల్లో ఎక్కువగా హెల్మెట్‌ లేకుండా వాహనం నడిపినందుకే ఉండటం గమనార్హం. ఇంతగా ట్రాఫిక్‌ వాయిలెన్స్‌కు పాల్పడిన  సదరు వాహనదారుడికి ఏమైనా శిక్ష విధిస్తారా, లేక లైసెన్స్‌ రద్దు చేస్తారా అనేది వేచి చూడాల్సి ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement