తలలోకి బుల్లెట్లు చొచ్చుకుపోయి.. సీఐఎస్‌ఎఫ్‌ కానిస్టేబుల్‌ మృతి | CISF Constable Dies After Gun Misfire At Sangareddy | Sakshi
Sakshi News home page

ప్రమాదవశాత్తు తుపాకీ పేలి.. సీఐఎస్‌ఎఫ్‌ కానిస్టేబుల్‌ మృతి

Published Sat, Jul 20 2024 6:08 PM | Last Updated on Sun, Jul 21 2024 1:09 AM

CISF Constable Dies After Gun Misfire At Sangareddy

సాక్షి, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. పటాన్‌చెరులోని బీడీఎల్‌ కంపెనీలో సీఐఎస్‌ఎఫ్‌ కానిస్టేబుల్‌ డ్యూటీ ముగించుకొని ఇంటికి వెళ్తున్న సమయంలో బస్సులో ప్రమాదవశాత్తు తుపాకీ పేలి మృతిచెందాడు. 

సీఐఎస్‌ఎఫ్‌ఎస్‌ యూనిట్‌ లైన్‌ బ్యారెక్‌లో బస్సు దిగే క్రమంలో అతని వద్ద ఉన్న ఇన్సస్‌ రైఫిల్ పేలి తూటా తలలోకి దూసుకెళ్లడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. మృతుడిని నంద్యాల జిల్లా అవుకు మండలం జూనూతల గ్రామానికి చెందిన జవాను వెంకటేష్‌గా గుర్తించారు. 

కాగా వెంకటేష్‌ ఏడాదిన్నర క్రితం ట్రాన్స్ ఫర్ కింద హైదరాబాద్‌ వచ్చి సీఐఎస్‌ఎఫ్‌ బెటాలియన్‌లో విధులు నిర్వహిస్తున్నారు. మృతునికి భార్య లక్ష్మీదేవి, తొమ్మిదేళ్ల కొడుకు సాయి, ఎనిమిదేళ్ల పాప సాయి పల్లవి ఉన్నారు. తుపాకీ పేలిన ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇది ప్రమాదమా.. లేక ఆత్మహత్య  అనే కోణంలో  విచారణ జరుపుతున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement