
సాక్షి, హత్నూర(సంగారెడ్డి): డీజే సౌండ్ డబ్బుల చెల్లింపు విషయంలో మనస్తాపానికి గురైన ఓ యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై లక్ష్మారెడ్డి తెలిపారు. చందాపూర్‌కు చెందిన కర్రె నగేష్ కుమారుడు కర్రె మధు కుమార్(21) ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఈనెల 5న బోనాల పండుగ సందర్భంగా అద్దెకు తీసుకున్న డీజే సౌండ్ సిస్టం విషయంలో డీజే యజమాని పల్పనూరి మధుతో మధ్య డబ్బుల విషయంలో గొడవ జరిగింది.
మనస్తాపానికి గురైన మధుకుమార్ శనివారం రాత్రి గ్రామ శివారులో చెట్టుకు ఉరి వేసుకున్నాడు. మృతుడి తండ్రి కర్రె నగేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై లక్ష్మారెడ్డి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment