
న్యూయార్క్ వెళ్తున్న విద్యార్థి ... బుల్లెట్ స్వాధీనం
నగరంలోని శంషాబాద్ ఎయిర్పోర్ట్లో న్యూయార్క్ వెళ్తున్న విద్యార్థి శామ్యుల్ నుంచి కస్టమ్స్ అధికారులు బుల్లెట్ స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్: నగరంలోని శంషాబాద్ ఎయిర్పోర్ట్లో న్యూయార్క్ వెళ్తున్న విద్యార్థి శామ్యుల్ నుంచి కస్టమ్స్ అధికారులు బుల్లెట్ స్వాధీనం చేసుకున్నారు. అనంతరం శామ్యుల్ను పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శామ్యుల్ హైదరాబాద్ నగరానికి చెందిన వాడని పోలీసులు తెలిపారు. బెంగళూరులో పేలుడు, నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో విమానాశ్రయాలల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. అందులోభాగంగా తనిఖీలను మమ్మరం చేశారు. అయితే సోమవారం శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ప్రయాణికుడి వద్ద నుంచి మూడు బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు.