
సాక్షి, షాద్‌నగర్ : దిశ హత్య కేసులో నిందితులను ఎన్‌కౌంటర్ చేసిన ప్రదేశంలో పోలీసులు ఉపయోగించిన బుల్లెట్ల కోసం ప్రత్యేక బృందాలు శనివారం ఉదయం గాలించాయి. చటాన్‌పల్లి బ్రిడ్జి సమీపంలోని ఘటనా స్థలంలో మెటల్ డిటెక్టర్‌ల సాయంతో ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు వెతికారు. పోలీసుల ఎదురుకాల్పుల్లో నలుగురు నిందితులకు మొత్తం 12 బుల్లెట్ గాయాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అయితే పోలీసులు వారిపై మొత్తం 15 రౌండ్ల కాల్పులు జరిపినట్లు విశ్వసనీయ సమాచారం. ఘటనా స్థలంలో పడిన బుల్లెట్లను స్వాధీనం చేసుకునేందుకు వాటి కోసం చుట్టుపక్కల ప్రాంతాన్ని జల్లెడపట్టారు. ఎన్ని బుల్లెట్లు లభించాయనే వివరాలు మాత్రం పోలీసులు వెల్లడించలేదు.
Comments
Please login to add a commentAdd a comment