
షాద్‌నగర్‌టౌన్: షాద్‌నగర్ మరోసారి ఉలిక్కిపడింది. మూడేళ్ల క్రితం గ్యాంగ్‌స్టర్ నయీంను ఎన్‌కౌంటర్ చేసిన ప్రాంతానికి సుమారు మూడు కిలోమీటర్ల దూరంలోనే దిశ హత్యకేసులో నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. నయీంను షాద్‌నగర్‌లోని మిలీనియం టౌన్ షిప్ ఇళ్ళ మధ్య ఎన్‌కౌంటర్ చేయగా..దిశ హత్యకేసు నిందితుల్ని చటాన్‌పల్లి శివారులో జాతీయ రహదారి పక్కన కాల్చిపారేశారు.
ఈ రెండు ఘటనలు పోలీసుల చెర నుంచి నిందితులు తప్పించుకుని వెళ్తున్నప్పుడు జరిగినవే. ఈ రెండు ఘటనలు కూడా షాద్‌నగర్ ప్రాంత వాసులకు ఉదయం 7గంటల ప్రాంతంలో తెలిశాయి. తాజాగా ‘దిశ’నిందితుల ఎన్‌కౌంటర్ నేపథ్యంలో షాద్‌నగర్ పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోయింది.