బుల్లెట్ ఫైరింజన్
కృష్ణాపుష్కరాల సందర్భంగా శ్రీశైలంలో అగ్నిమాపకదళ సిబ్బంది ఏర్పాటు చేసిన అత్యాధునిక బుల్లెట్ ఫైరింజన్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. దీని గురించి జిల్లా అగ్నిమాపక అధికారి భూపాల్‌రెడ్డి మాట్లాడుతూ ‘దీనిని మిస్ట్ బుల్లెట్‌గా పిలుస్తారు. జిల్లాలో ఇలాంటివి రెండు ఉన్నాయి. ఎక్కడైనా చిన్న సందుల్లో అగ్ని ప్రమాదం జరిగితే ఈ బైక్‌పై వేగంగా వెళ్లి మంటలను అదుపు చేస్తోంది. బైక్ వెనుక భాగంలో రెండు సిలిండర్లు అమర్చబడి ఉంటాయి. ఒకSసిలిండర్‌లో తొమ్మిది లీటర్ల నీరు, మరొ సిలిండర్‌లో ఫోమ్ (సబ్బు నురుగు) ఉంటుంది. మొదటి సిలిండర్‌లో ఉన్న నీటితో గుడిసెలు, గడ్డివాములు దగ్ధమైనప్పుడు ఒక చుక్క నీరు 1600 బిందువులుగా విడిపోయి మంటలను అదుపు చేస్తోంది. పెట్రోల్, డీజీల్ వంటి అగ్నిప్రమాదాలు జరిగినప్పుడు ఫోమ్ చల్లడంతో అక్కడ పొర ఏర్పడి ఆక్సిజన్ లేకుండా చేసి మంటలు వ్యాపించకుండా చేస్తోంది.
– శ్రీశైలం (బండి ఆత్మకూరు)