స్పెషల్ ఎఫెక్ట్.. అదుర్స్ | Special Effect .. Adhurs | Sakshi
Sakshi News home page

స్పెషల్ ఎఫెక్ట్.. అదుర్స్

Published Sat, Mar 12 2016 1:27 AM | Last Updated on Sun, Sep 3 2017 7:30 PM

Special Effect .. Adhurs

నుదిటిన బుల్లెట్ గాయం.. ధారాళంగా కారుతున్న రక్తం.. మంటల్లో కాలిన ముఖం.. అక్కడక్కడా కత్తిగాట్లు.. గాయాలు.. ఇదేంటి ఎక్కడైనా రోడ్డు ప్రమాదం గానీ, అగ్నిప్రమాదం గానీ సంభవించిందా అనుకుంటున్నారా? కంగారు పడకండి. అలాంటిదేమీ లేదు. ఎప్పుడూ మనం సినిమాల్లో చూసే ఇలాంటి ఉత్తుత్తి గాయాలను ప్రత్యక్షంగా స్పెషల్ ఎఫెక్ట్ మేకప్ వేసి చూపించారు సినీ పరిశ్రమకు చెందిన ఈశ్వర్, రాజు. నాటి స్టార్ వార్స్, జురాసిక్ పార్క్ వంటి హాలీవుడ్ చిత్రాల నుంచి నేటి బాహుబలి, ఐ వంటి చిత్రాల్లో కీలకంగా మారిన ఈ స్పెషల్ ఎఫెక్ట్ మేకప్‌ను కళ్లకు కట్టినట్టు చూపించారు. నగరంలోని ఓ ఇన్‌స్టిట్యూట్‌లో కంప్యూటర్ గ్రాఫిక్స్ అండ్ విజువల్ ఎఫెక్ట్స్‌లో శిక్షణ పొందుతున్న విద్యార్థులకు శనివారం వర్క్‌షాపు నిర్వహించారు.

కత్తిగాటు నుంచి గ్రహాంతర వాసి వరకూ ఈ మేకప్‌తో సంచలనం సృష్టించవచ్చంటూనే వాటిని ఎలా వేయాలో చూపించారు. బాహుబలి లోని కాలకేయ పాత్ర మేకప్ గురించి విద్యార్థులు అడగ్గా, వెంటనే దానిని సృష్టించి ఆకట్టుకున్నారు. భార త సినీ పరిశ్రమలో వీఎఫ్‌ఎక్స్, స్పెషల్ ఎఫెక్ట్ మేకప్‌తో అద్భుతాలను సృష్టిస్తున్నట్లు ఈశ్వర్ తెలిపారు. ఇప్పటివరకు తాను 150కు పైగా చిత్రాలకు స్పెషల్ ఎఫెక్ట్స్ మేకప్‌ను అందించినట్లు తెలిపారు.                          - విజయవాడ (లబ్బీపేట)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement