తిరువనంతపురం: కేరళలోని తిరువనంత పురం జిల్లా అత్తింగళ్‌లో దళిత బాలికపై 12 మంది రెండునెలలుగా సామూహిక అత్యాచారం చేసి తీవ్రంగా హింసించారు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. అత్తింగళ్‌కు చెందిన బాధితురాలు కుటుంబ పోషణకోసం సినిమాల్లో డాన్సర్‌గా పనిచేస్తోంది. ఫిబ్రవరి 2న బార్‌లో తాగిపడిపోయిన సోదరుడిని తీసుకురావడానికి వెళ్లిన ఆమెను అమీర్, అనూప్ షా అనే వ్యక్తులు ఓ నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్ళి అత్యాచారం చేశారు. వీడియోను తీశారు.
సంగతి బయటపెడితే ఈ వీడియోను సోషల్ మీడియాలో పెడ్తామంటూ బెదిరించారు. తర్వాత ఆమెపై పలుసార్లు అత్యాచారానికి పాల్పడ్డారు. ఫిబ్రవరి 2 నుంచి మార్చి 30 వరకు డబ్బులకోసం ఆమెను పలువురి వద్దకు పంపారు. మార్చి 30న పారేపల్లి జిల్లాలో ఆమెపై అత్యాచారానికి పాల్పడగా స్థానికులు అందించిన సమాచారంతో పోలీసులు ఆమెను కాపాడారు. ఏడుగురిని అరెస్టు చేశారు.
దళిత బాలికపై రెండు నెలలుగా గ్యాంగ్ రేప్
Published Wed, Apr 6 2016 2:48 AM | Last Updated on Tue, Aug 21 2018 5:46 PM
Advertisement
Advertisement