
పట్టాలు తప్పిన తిరువనంతపురం ఎక్స్‌ప్రెస్
కేరళ సమీపంలో తిరువనంతపురం-మంగళూరు ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పింది.
కారుకుట్టి: కేరళ సమీపంలోని కారుకుట్టి రైల్వే స్టేషన్ వద్ద తిరువనంతపురం-మంగళూరు ఎక్స్‌ప్రెస్ అర్థరాత్రి 2.30 గంటల ప్రాంతంలో రైలు పట్టాలు తప్పింది. రైలు 12 బోగీలు పట్టాలు తప్పడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
అదృష్టవాశాత్తూ ఈ రైలు ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరుగలేదు. అందరూ క్షేమంగా బయటపడ్డారు. ప్రయాణికులను అక్కడి నుంచి బస్సులో త్రిసూర్ రైల్వేస్టేషన్‌కు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.