
కేరళ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోనియా గాంధీ
తిరువనంతపురం: కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ బీజేపీపై విమర్శల దాడి చేశారు. కేరళలోని త్రివేండ్రంలో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించే మహిళా అభ్యున్నతి కార్యక్రమం 'కుదుంబశ్రీ' 16వ వార్షిక కోత్సవ సభను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నరేంద్ర మోడీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
కేంద్రంలో ఎన్‌డీఏ సర్కార్ రాకతో పలు రాష్ట్రాల్లో మత హింసాత్మక సంఘటనలు పెచ్చు మీరిపోయాయని ఆరోపించారు. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రలలో జరిగిన ఘటనలను ఆమె గుర్తు చేశారు. యూపీఏ రూలింగ్‌లో మతహింసలు చాలా అరుదుగా జరిగాయని సోనియా చెప్పారు.
కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన సభలో కూడా సోనియా గాంధీ మాట్లాడారు.