
తిరువనంతపురం: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కేరళలో రాజకీయం వేడెక్కుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ పార్టీ ఆదివారం విడుదల చేసింది. విడుదల చేసిన అభ్యర్థుల జాబితాలో తనకు సీటు కేటాయించకపోవడతో రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు లతికా సుభాష్ తన పదవికి రాజీనామా చేశారు. అయితే ఎత్తిమన్నూర్ సీటును కేటాయిస్తారని ఆమె భావించారు.
కానీ, అదిష్టానం నుంచి నిరాశ ఎదురవడంతో తనకు అన్యాయం జరిగిందంటూ లతికా ఆవేదన వ్యక్తం చేశారు. అంతటితో ఆగకుండా పార్టీ కేంద్ర కార్యాలయం ఇందిరా భవన్‌లో శిరోముండనం చేసుకొని నిరసన తెలిపారు. రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ ముల్లపల్లి రామచంద్రన్ నేడు ఢిల్లీలో అభ్యర్థు జాబితాను విడుదల చేశారు. కేరళ రాజకీయ చరిత్ర టికెట్ నిరాకరించడంతో ఇలా నిరసన వ్యక్తం చేయటం మొదటిసారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment