tickets allocation
-
Lok Sabha Election 2024: మహిళలకు బీజేడీ సముచిత స్థానం!
లోక్‌సభ ఎన్నికల్లో ఒడిశాకు చెందిన బిజూ జనతాదళ్ (బీజేడీ) ఆదర్శంగా నిలిచింది. టికెట్ల కేటాయింపులో మహిళలకు సముచిత స్థానమిచ్చి గౌరవించింది. రాష్ట్రంలో 21 లోక్‌సభ స్థానాలుంటే ఏడు చోట్ల మహిళలకు అవకాశం ఇచి్చంది. అంటే వారికి 33 శాతం సీట్లు కేటాయించింది. లేఖశ్రీ సమంత్ సింగార్ (బాలాసోర్), శర్మిష్ట సేథీ (జజ్పూర్), మంజులా మండల్ (భద్రక్), రాజశ్రీ మల్లిక్ (జగత్సింగ్పూర్), పరిణీతి మిశ్రా (బార్గఢ్), కౌసల్యా హికాక (కోరాపుట్), రంజితా సాహూ (ఆస్క)కు టికెట్లిచ్చింది. అదే సమయంలో టికెట్ల కేటాయింపులో ఫిరాయింపుదారులకు కూడా పెద్ద పీట వేసి విమర్శకుల నోళ్లకు పని చెప్పింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కూడా ఏడుగురు మహిళలకు బీజేడీ చీఫ్, సీఎం నవీన్ పట్నాయక్ టికెట్లివ్వడం గమనార్హం. ఈసారి బీజేడీ నుంచి బరిలోకి దిగిన ఏడుగురు మహిళా అభ్యర్థుల్లో బీజేపీ నుంచి వచి్చన లేఖశ్రీ సమంత్ సింగార్ కూడా ఉన్నారు. ఆమె బాలాసోర్ నుంచి పోటీ చేస్తున్నారు. 2019 ఎన్నికల్లో కూడా ఏడుగురు బీజేడీ మహిళా అభ్యర్థుల్లో ఇద్దరు పార్టీ ఫిరాయింపుదారులున్నారు! ఈ విడత ఇద్దరు సిట్టింగ్ మహిళా ఎంపీలు చంద్రాణి ముర్ము (కియోంజర్), ప్రమీలా బిసోయ్ (ఆస్క)లకు నవీన్ టికెట్లివ్వలేదు. ఫిరాయింపుదారులకూ 33 శాతం ఒకరిద్దరు కాదు.. బీజేడీ ఈ విడత ఏకంగా 38 శాతం మంది ఫిరాయింపుదారులను లోక్‌సభ బరిలో దింపడం ఆశ్చర్యకరం. అంటే ప్రతి ముగ్గురిలో ఒకరు ఇతర పారీ్టల నుంచి వచి్చచేరిన వారే! లేఖశ్రీ సమంత్ సింగార్ (బాలాసోర్), భృగు బాక్సిపాత్ర (బెర్హాంపూర్), ప్రదీప్ మాంఝి (నబరంగ్‌పూర్), సురేంద్ర సింగ్ భోయ్ (బోలంగీర్), పరిణీత మిశ్రా (బార్గఢ్), ధనర్జయ్ సిధు (కియోంఝర్), అన్షుమన్ మహంతి (కేంద్రపర), మన్మోత్ రూట్రే (భువనేశ్వర్) ఇతర పారీ్టల నుంచి వచ్చి బీజేడీ టికెట్ సంపాదించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
సేనానిని నమ్ముకో.. ఉన్నదంతా అమ్ముకో !
తమ్ముణ్ణి సినిమాకు తీసుకెళ్లావ్..నన్నుతీసుకెళ్లలేదు..వాడికి కొత్త బట్టలు కొన్నావు,సైకిల్ కొన్నావ్..నాకు కొనలేదు అని పిల్లలు అలుగుతుంటారు..అలాంటప్పుడు తల్లి, తండ్రి వాణ్ని దగ్గరకు తీసి ఒరేయ్ చిన్నోడా అది కాదురా.. వాడికి సైకిల్ కొన్నాను కదా... నీకూ కొంటాను.. నీకు ఇంకోటి కొంటాను.. వాణ్ని సినిమాకు తీసుకెళ్ళాను కదా.. నువ్వు బాధపడకు నిన్ను జాతరకు తీసుకెళ్తాను... బాధపడకు... అని ఓదార్చాలి... అదే కుటుంబం బాధ్యత. అదే విధంగా పార్టీలో ఉన్నవాళ్లందరికీ ఎన్నికల్లో టికెట్లు ఇవ్వడం సాధ్యం కాకపోవచ్చు.. అలాంటప్పుడు పిలిచి ఇదిగోవయ్యా.. నువ్వు బాగానే కష్టపడ్డావు కానీ నీకు నేను టికెట్ ఇవ్వలేకపోతున్నాను.. దానికి ఏవేవో కారణాలు ఉన్నాయ్.. కాబట్టి ఏమీ అనుకోకు.. పార్టీ కోసం పని చేయండి.. గెలిస్తే మిమ్మల్ని తప్పక గౌరవిస్తాం అని చెప్పాల్సిన బాధ్యత పార్టీ అధినేత మీద ఉంటుంది. కానీ జనసేనాని వీటన్నిటికీ అతీతంగా ఉంటారు.. టికెట్లు తనకు నచ్చినవాళ్లకు ఇచ్చుకుంటారు. తిరుపతిలో కిరణ్ రాయల్ కావచ్చు.. విజయవాడ వెస్ట్ లో పోతిన మహేష్..ఇలా ఎన్నో జిల్లాల్లో ఎంతోమంది పవన్ కోసం పదేళ్లుగా పని చేస్తూ లక్షలు, కోట్లు తగలేశారు. ఇన్నేళ్ళుగా వాళ్ళను వాడుకుని అక్కడ పార్టీ ఉనికిలోకి వచ్చాక.. ప్రజల్లో కాస్త గుర్తింపు వచ్చాక అక్కడి సీటును వేరేవాళ్లకు ఇచ్చుకోవడం, ఇదేమంటే పొత్తు ధర్మం అని, త్యాగాలకు సిద్ధం కావాలని సమర్థించుకోవడం పవన్ కు అలవాటుగా మారింది. పోతిన మహేష్ టికెట్ బీజేపీకి అంటే సుజనా చౌదరికి ఇవ్వడానికి వెనుక కోట్లు చేతులుమారాయని అంటున్నారు. ఇదిలా ఉండగా ఇలా పవన్‌ను నమ్ముకుని బికారులు అయిపోయినవాళ్లు రాష్ట్రవ్యాప్తంగా పదులసంఖ్యలోనే ఉన్నారు అయితే ఏనాడూ.. పవన్ అలా నష్టపోయిన లేదా మోసపోయినవాళ్లను పిలిచి వాళ్ళతో మాడ్లాడడం కానీ... వారి రాజకీయ భవిష్యత్తుకు భరోసా..హామీ కానీ ఇచ్చినట్లు వినలేదు. మాకు పవన్ మద్దతుగా ఉంటామన్నారు అని ఇంతవరకూ ఏ ఒక్క నాయకుడూ చెప్పలేదు. ఆంటే ఆయనది అంతా తన ఇష్టానుసారం. తనకు నచ్చినవాళ్లకు టికెట్లు ఇచ్చుకోవడం.. ఆయన్ను నమ్ముకుని మునిగిపోయినవాళ్లు పోవడం.. అంతే తప్ప...కనీసం వాళ్ళ బాధను చెప్పుకోవడానికి కూడా పార్టీలో ఇంకో వ్యక్తి, ఇంకో నాయకుడు లేకపోవడం ఇక్కడ దారుణం. దీంతో బాధితుల రోదన అరణ్య రోదన అవుతోంది తప్ప వాళ్ళ గోడు వినేవాళ్ళు లేకుండాపోయారు. దీంతో ఎక్కడికక్కడ జిల్లాలు.. నియోజకవర్గాల్లో పార్టీని మోసి మోసపోయిన జనసేన నాయకులంతా ఒక్కొక్కరుగా రాజీనామాలు చేస్తూ తమ దారితాము చూసుకుంటున్నారు. తాను పిఠాపురంలో గెలిస్తే చాలు..పార్టీ మొత్తం ఏమైపోయినా ఫర్లేదు...అనే భావనలో పవన్ ఉండడంతో క్యాడర్ సైతం మెల్లగా సైడ్ అయిపోతున్నారు. --సిమ్మాదిరప్పన్న -
పసుపు పార్టీ ఉక్కిరిబిక్కిరి
సాక్షి, నెట్వర్క్: విపక్ష కూటమిలో ఏర్పడిన టికెట్ల ముసలం చల్లారేలా కన్పించడం లేదు. టికెట్ల కేటాయింపులో న్యాయం జరగలేదని ఎక్కడికక్కడ తెలుగు తమ్ముళ్లు నిరసనలు, ర్యాలీలతో రోడ్డెక్కుతున్నారు.టీడీపీ ఆఖరి జాబితాపై పార్టీలో అసంతృప్తి వెల్లువెత్తింది. అభ్యర్థులను మార్చాలంటూ ప్లెక్సీలు చించుతూ కరపత్రాలు తగలబెట్టారు. నెల రోజుల క్రితం గుమ్మనూరు జయరాంను చంద్రబాబు, లోకేశ్ తిట్టని తిట్టు లేదు. ఇప్పుడు ఆయనకే అనంతపురం జిల్లా గుంతకల్లు అసెంబ్లీ టికెట్ ఇచ్చారు. అనంతపురం అర్బన్ స్థానంలో సీనియర్ నేత ప్రభాకర్ చౌదరిని కాదని దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్‌కు టికెట్ కేటాయించారు. ఈ నేపథ్యంలో గుంతకల్లు, అనంతపురం నియోజకవర్గాల్లో అసంతృప్తి జ్వాలలు రగులుకున్నాయి. జయరాంకు టికెట్ కేటాయించినట్లు ప్రకటించగానే జితేందర్‌గౌడ్ వర్గీయులు ఆగ్రహించి పార్టీ కార్యాలయంలో ఫర్నీచర్ ధ్వంసం చేశారు. చంద్రబాబు చిత్రపటాన్ని చెప్పులతో కొడుతూ జయరాంకు పార్టీ అమ్ముడు పోయిందంటూ నినాదాలు చేశారు. అనంతపురం అర్బన్‌లో తన పేరు లేకపోవడంతో ప్రభాకర్ చౌదరి తన అనుచరులతో స్థానిక రామ్‌నగర్‌లోని పార్టీ కార్యాలయంలో ఫర్నిచర్‌ను బయటపడేసి కార్యకర్తలతో నిప్పు పెట్టించారు. ఫర్నీచర్ మొత్తం మంటల్లో కాలిబూడిదైంది. పోలీసులు, ఫైర్ సిబ్బంది వెంటనే స్పందించి మంటలను ఆర్పేశారు. ఫ్లెక్సీలు, ఫొటోలు, కరపత్రాలు మంటల్లో కాలిపోయాయి. చంద్రబాబు ఫ్లెక్సీలు, కరపత్రాలకు నిప్పు పాడేరు అసెంబ్లీ టీడీపీ అభ్యర్థిగా కిల్లు రమేష్ నాయుడును ఆ పార్టీ అధిష్టానం ప్రకటించడంతో తెలుగు తమ్ముళ్లు ఆందోళనకు దిగారు. టీడీపీ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరికి టికెట్ రాకపోవడంతో ఆమె అనుచరులు శుక్రవారం రాత్రి చంద్రబాబు ఫొటోలతో ఉన్న టీడీపీ ఫ్లెక్సీలు, కరపత్రాలకు నిప్పంటించారు. రమేష్‌నాయుడుకు సహకరించేది లేదని అధిష్టానాన్ని హెచ్చరించారు. పాడేరు టికెట్ సీనియర్ నేత ఎంవీవీ ప్రసాద్‌కు కేటాయించకపోవడంపై శుక్రవారం కొయ్యూరులో టీడీపీ శ్రేణుల ఆందోళన చేపట్టారు. టీడీపీ ఫ్లెక్సీలను తగులబెట్టారు. సత్యవేడు నియోజకవర్గం ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిమూలం మాకొద్దంటూ అసమ్మతి నాయకులు శుక్రవారం ఎన్ఆర్ఐ రమే‹Ùబాబు నేతృత్వంలో తిరుపతిలో సమావేశమయ్యారు. ఆదిమూలంకు సహకరించబోమని, ఇప్పటికైనా కొత్త అభ్యర్థిని ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. చీపురుపల్లి టికెట్‌ను కిమిడి కళా వెంకటరావుకు కేటాయించడంతో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కిమిడి నాగార్జున తన పదవులకు రాజీనామా చేస్తున్నట్టు వెల్లడించారు. ఎంతో కష్టపడి పని చేసిన తనను కాదని వేరే ఎవరినో తెచ్చి పెట్టాల్సిన పనేముందని ప్రశ్నించారు. భవిష్యత్ కార్యాచరణ రెండు రోజుల్లో వెల్లడిస్తానన్నారు. నాగార్జున వెంటే మండల నాయకులు రాజీనామాల బాటలో నడిచారు. నాగార్జున నివాసం వద్ద చంద్రబాబు ఫొటోలతో ఉన్న కరపత్రాలను దహనం చేశారు. అనంతరం మూడు మండలాల నాయకులు, కార్యకర్తలు పట్టణంలోని మూడు రోడ్ల జంక్షన్‌కు చేరుకుని విజయనగరం–రాజాం ప్రధాన రహదారిపై చంద్రబాబు ఫొటోలతో ఉన్న కరపత్రాలను తగలబెట్టి వ్యతిరేక నినాదాలు చేశారు. నెల్లిమర్లలో గరంగరం ‘టీడీపీలో సొమ్ము ఉన్నవాళ్లకే సీట్లు ఇస్తారా? ఇదెక్కడి న్యాయం? నాలుగేళ్లు ఇంట్లో కూర్చొన్న గంటా శ్రీనివాసరావుకు రూ. కోట్లు ఉన్నాయని భీమిలి టికెట్ ఇచ్చారు. ప్రతి రోజూ పార్టీ కోసం కష్టపడిన నాలాంటి వాళ్లను పక్కనబెట్టారు’ అని విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి కర్రోతు బంగార్రాజు ఆవేదన వ్యక్తం చేశారు. భోగాపురం మండలం పోలిపల్లిలో సాయంత్రం అత్యవసరంగా సమావేశమయ్యారు. నెల్లిమర్ల టికెట్ తనకేనని అరచేతిలో వైకుంఠం చూపించిన పార్టీ అధిష్టానానికి బుద్ధి చెప్పాలని, స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీ చేయాల్సిందేనని వారంతా బంగార్రాజుకు మద్దతు పలికారు. నెల్లిమర్ల టికెట్ జనసేనకు ఇచ్చేశారని, న్యాయం చేయాలని అడిగితే భీమిలి పంపిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారన్నారు. తీరా ఇప్పుడు ఆ భీమిలి సీటు గంటా శ్రీనివాసరావుకు ఇచ్చేశారని, విజయనగరం లోక్‌సభ టికెట్ నాన్‌లోకల్ వ్యక్తి కలిశెట్టి అప్పలనాయుడికి కట్టబెట్టారని బాధపడ్డారు. తూర్పు గోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలో మొదట నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పేరు ప్రకటించి తర్వాత టికెట్ బీజేపీకి కట్టబెట్టడంతో నాలుగు రోజులుగా తీవ్ర స్థాయిలో నిరసన తెలుపుతున్నారు. ఏకంగా ఆ పార్టీ జెండాలను, కరపత్రాలను తగులబెట్టి అధినేత తీరుపై ఆగ్రహావేశాలతో మండిపడ్డారు. అమీతుమీ తేల్చుకోవడానికి సిద్ధమవుతున్న నల్లమిల్లిని బుజ్జగించేందుకు టీడీపీ అధిష్టానం రాయబారానికి దిగినా చర్చలు సఫలం కాలేదు. దీంతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగాలని నల్లమిల్లి నిర్ణయించుకున్నట్లు సమాచారం. మూడు పార్టీలు.. మూడు దారులు అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె టీడీపీలో అసంతృప్తులు, వర్గపోరు ముదిరింది. శుక్రవారం నియోజకవర్గంలో జరిగిన టీడీపీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలకు మాజీ ఎమ్మెల్యే శంకర్ వర్గంతోపాటు సీనియర్ నేతలు కన్నెత్తి చూడలేదు. మరోవైపు నియోజకవర్గంలో టీడీపీ, బీజేపీ జనసేన పొత్తు జాడ కనిపించడం లేదు. ప్రచార కరపత్రాలు, బ్యానర్లలో జనసేన నాయకులు పేర్లు, ఫోటోలు లేకపోవడంపై బి.కొత్తకోట మండలం గట్టులో జరిగిన కార్యక్రమంలో జనసేన నాయకులు టీడీపీ నేతలను నిలదీశారు. కరపత్రాలను చింపేశారు. రాయచోటికి చెందిన మాజీ జెడ్పిటీసీ సుగవాసి బాలసుబ్రమణ్యంను రాజంపేట టీడీపీ అభ్యర్థిగా అధిష్టానం ఖరారు చేయడంతో అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడ్డాయి. సుగవాసి అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ తమ్ముళ్లు ఆందోళనకు దిగారు. టీడీపీ కరపత్రాలను కాల్చివేశారు. క్లస్టర్ ఇన్చార్జితో సహా పదిమంది బూత్ కన్వినర్లు పార్టీకి రాజీనామా చేశారు. బత్యాల చంగల్రాయుడును రాజంపేట టీడీపీ అభ్యర్థిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు కుట్రలో బీజేపీ పడిందని బీజేపీ నాయకులు పనతల సురేష్ ఆరోపించారు. టీడీపీ అభ్యర్ధిగా ఉన్న రోశన్నకు బీజేపీ కండువాను కప్పి ఆయనకు సీటును కేటాయించడం వెనుక మతలబు ఏమిటని ప్రశ్నించారు. అసలు రోశన్నకు బీజేపీలో సభ్వత్వమే లేదన్నారు. ఏ అర్హతతో రోశన్నకు టికెట్ కేటాయించారని మండిపడ్డారు. గంటాకు సహకరించబోం..జనసేన నేతలు, వీరమహిళలు ‘జనసేన ఆవిర్భావం నుంచి నిరంతరం కష్టపడ్డాం. డబ్బు వృథా చేసుకున్నాం. భీమిలి నియోజకవర్గంలో జనసేనపార్టీ బలోపేతానికి ఎంతగానో కష్టపడితే నేడు టీడీపీ అభ్యర్థికి టికెట్ ఇవ్వడం ఏంటని భీమిలి నియోజకవర్గ జనసేన ఇన్చార్జ్ పంచకర్ల సందీప్‌ను జనసేన నాయకులు, వీరమహిళలు ప్రశ్నించారు. శుక్రవారం సాయంత్రం ఎండాడ పార్టీ కార్యాలయంలో సందీప్ సమావేశం ఏర్పాటు చేశారు. పార్టీ కోసం తాను కష్టపడి ప్రభు త్వంపై ఎన్నో పోరాటాలు చేశానని అయితే పార్టీ ఆదేశానుసారం ఉమ్మడి అభ్యర్థిగా గంటాను ప్రకటించారని సందీప్ చెప్పగా ఒక్కసారిగా జనసేన నాయకులు ఆందోళనకు దిగారు. భీమిలి టికెట్ జనసేనకేనని ఎదురుచూశామని, టీడీపీకి ఎలా కేటాయి స్తారని, పార్టీ కోసం ఇన్నాళ్లు కష్టపడిన మా భవిష్యత్తు ఏంటని నిలదీశారు. టీడీపీ అభ్యర్థి గంటాకు తాము మద్దతు ఇవ్వబోమ ని స్పష్టం చేశారు. గంటా ఎక్కడి వాడు. ఎప్పు డు ఏ నియోజకవర్గంలో ఉంటాడో తెలియదు. ఎక్కడ నుంచి పోటీ చేస్తాడో తెలీ దు. ఏ పార్టీ నుంచి పోటీ చేస్తాడో కూడా తెలియదు. అలాంటి వ్యక్తికి తాము ఎలా మద్దతు ప్రకటించాలని ప్రశ్నించారు. గంటాకు మద్దతు ప్రకటించలేమని వారు తేల్చి చెప్పేశారు. మూడు రోజులు సమయం ఇస్తున్నామని, అభ్యర్థిని మార్చకుంటే మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తామని హెచ్చరించారు. -
టికెట్ నిరాకరణ.. మహిళ శిరోముండనంతో నిరసన
తిరువనంతపురం: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కేరళలో రాజకీయం వేడెక్కుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ పార్టీ ఆదివారం విడుదల చేసింది. విడుదల చేసిన అభ్యర్థుల జాబితాలో తనకు సీటు కేటాయించకపోవడతో రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు లతికా సుభాష్ తన పదవికి రాజీనామా చేశారు. అయితే ఎత్తిమన్నూర్ సీటును కేటాయిస్తారని ఆమె భావించారు. కానీ, అదిష్టానం నుంచి నిరాశ ఎదురవడంతో తనకు అన్యాయం జరిగిందంటూ లతికా ఆవేదన వ్యక్తం చేశారు. అంతటితో ఆగకుండా పార్టీ కేంద్ర కార్యాలయం ఇందిరా భవన్లో శిరోముండనం చేసుకొని నిరసన తెలిపారు. రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ ముల్లపల్లి రామచంద్రన్ నేడు ఢిల్లీలో అభ్యర్థు జాబితాను విడుదల చేశారు. కేరళ రాజకీయ చరిత్ర టికెట్ నిరాకరించడంతో ఇలా నిరసన వ్యక్తం చేయటం మొదటిసారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. చదవండి: కేరళ బీజేపీ అభ్యర్థుల జాబితా విడుదల -
చిచ్చురేపిన టికెట్ల లొల్లి.. కాంగ్రెస్‌కు షాక్!
సాక్షి, చంఢీగఢ్: వరుస ఓటములు, అంతర్గత కలహాలతో తికమవుతున్న కాంగ్రెస్ పార్టీకి హర్యానా అసెంబ్లీ ఎన్నికల వేళ ఊహించని షాక్ తగిలింది. ఆ పార్టీ మాజీ పీసీసీ అధ్యక్షుడు, సీనియర్ నేత అశోక్ తన్వర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా టికెట్ల కేటాయింపులో తీవ్ర అవకతవకలు జరిగాయంటూ తీవ్ర ఆరోపణలు చేస్తూ.. రెండు రోజుల కిందట పీసీపీ పదవి నుంచి వైదొలిగిన అశోక్.. తాజాగా పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు శనివారం పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి నాలుగు పేజీల సుదీర్ఘ లేఖను రాశారు. పార్టీలోని అంతర్గత కలహాలా కారణంగా.. సిద్ధాంతాలు పూర్తిగా దారితప్పాయాని, గ్రూపు రాజకీయాలతో పార్టీ పూర్తిగా పతనావస్థకు చేరిందని లేఖలో పేర్కొన్నారు. చదవండి: కాంగ్రెస్‌లో టికెట్ల లొల్లి కాగా రాష్ట్రంలో టికెట్ల కేటాయింపుల్లో అవకతవకలు జరిగాయంటూ పార్టీ చీఫ్ సోనియా నివాసం ఎదుట తన్వర్ అనుచరులు కొందరు బుధవారం నిరసన తెలిపిన విషయం తెలిసిందే. హరియాణాలో పార్టీ ‘హూడా కాంగ్రెస్’గా మారిపోయిందని మాజీ సీఎం భూపీందర్ హూడాపై సోనియా గాంధీకి రాసిన లేఖలో తన్వర్ ఆరోపించారు. ఆయనకు గులాంనబీ ఆజాద్ అండగా ఉన్నారన్నారు. గత ఐదేళ్లుగాపార్టీకి ద్రోహం చేసిన వారికే ప్రాధాన్యం ఇస్తున్నారని విమర్శించారు. 90 టికెట్లలో 50 వరకు తనవారికే హూడా కేటాయించుకున్నారని పేర్కొన్నారు. ఈ పరిణామాలతో తీవ్ర నిరాశతో పార్టీ ఎన్నికల కమిటీల నుంచి రాజీనామా చేస్తున్నానని, ఇకపై సాధారణ కార్యకర్తగా మాత్రమే కొనసాగుతానని స్పష్టం చేశారు. తాజాగా పార్టీకి పూర్తిగా రాజీనామా చేశారు. కాగా ఆయన ఏ పార్టీలో చేరుతారనేది తెలియాల్సి ఉంది. బీజేపీ నేతలతో ఇదివరకే సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. -
కాంగ్రెస్‌లో టికెట్ల లొల్లి
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ/ముంబై: త్వరలో జరగనున్న మహారాష్ట్ర, హరియాణా అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీల కీలక పరిణామాలు సంభవించాయి. టికెట్ల కేటాయింపులో తమకు అన్యాయం జరిగిందంటూ పలువురు నేతలు ఢిల్లీలోని పార్టీ చీఫ్ సోనియా నివాసం ఎదుట నిరసనలకు దిగారు. ఈ ఆరోపణలతో హరియాణా రాష్ట్ర మాజీ చీఫ్ అశోక్‌తన్వర్ పార్టీ ఎన్నికల కమిటీల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. అయితే, పార్టీ సాధారణ కార్యకర్తగా కొనసాగుతానన్నారు. రాష్ట్రంలో టికెట్ల కేటాయింపుల్లో అవకతవకలు జరిగాయంటూ పార్టీ చీఫ్ సోనియా నివాసం ఎదుట తన్వర్ అనుచరులు కొందరు బుధవారం నిరసన తెలిపారు. హరియాణాలో పార్టీ ‘హూడా కాంగ్రెస్’గా మారిపోయిందని మాజీ సీఎం భూపీందర్ హూడాపై సోనియా గాంధీకి రాసిన లేఖలో తన్వర్ ఆరోపించారు. ఆయనకు గులాంనబీ ఆజాద్ అండగా ఉన్నారన్నారు. గత ఐదేళ్లుగాపార్టీకి ద్రోహం చేసిన వారికే ప్రాధాన్యం ఇస్తున్నారని విమర్శించారు. 90 టికెట్లలో 50 వరకు తనవారికే హూడా కేటాయించుకున్నారని పేర్కొన్నారు. ఈ పరిణామాలతో తీవ్ర నిరాశతో పార్టీ ఎన్నికల కమిటీల నుంచి రాజీనామా చేస్తున్నానని, ఇకపై సాధారణ కార్యకర్తగా మాత్రమే కొనసాగుతానని స్పష్టం చేశారు. పార్టీ అభ్యర్థులకు వ్యతిరేకంగా పోటీ చేయాలా వద్దా అనేది తన మద్దతుదారులకే వదిలేస్తున్నానన్నారు. అదేవిధంగా ముంబైలో..అభ్యర్థుల టికెట్ల కేటాయింపులపై కాంగ్రెస్‌లో విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. తను సూచించిన ఒకే ఒక్క అభ్యర్థికి టికెట్ ఇవ్వనందుకు నిరసనగా పార్టీ తరఫున ప్రచారంలో పాల్గొనబోనని ముంబై విభాగం మాజీ అధ్యక్షుడు, మాజీ ఎంపీ సంజయ్ నిరుపమ్ ప్రకటించారు. ‘పార్టీ నుంచి వైదొలిగే సమయం రాలేదని భావిస్తున్నా. కానీ, పార్టీ వైఖరి నా సేవలు అవసరం లేదని భావిస్తున్నట్లుగా ఉంది. దీన్నిబట్టి ఆ రోజు కూడా ఎంతో దూరంలో లేదనుకుంటున్నా’అని ట్విట్టర్లో ప్రకటించారు. -
భిక్షాటన చేయాలా లేక రాజకీయాల్లోకి ప్రవేశించాలా!
సాక్షి వెబ్ ప్రత్యేకం (భోపాల్): కుటుంబ పాలన, వారసత్వ రాజకీయాలకు చిరునామా అని కాంగ్రెస్‌ను ఎద్దేవా చేసే కమలనాథులు ఇప్పుడు స్వరం మార్చి తమ వారసుల రాజకీయ భవిష్యత్తు కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇన్నాళ్లూ ప్రత్యర్థి కాంగ్రెస్‌ను విమర్శించిన వారే ఇప్పుడు తమ పిల్లలకు ఎన్నికల్లో పోటీచేసే అవకాశమివ్వాలని పార్టీ అధిష్టానంపై ఒత్తిడి పెంచుతున్నారు. ఇందుకు ఉదాహరణగా మధ్యప్రదేశ్ విపక్ష బీజేపీ నేత గోపాల్ భార్గవ మాటల్ని చెప్పవచ్చు. బీజేపీ సీనియర్ నాయకులు తమ వారసులకు లోక్‌సభ టిక్కెట్ల కోసం ఆశిస్తున్నారట, నిజమేనా అని విలేకరులు అడిగిన ప్రశ్నకు.. ‘‘రైతు కొడుకు మళ్లీ తండ్రిలాగే వ్యవసాయం, అధికారి కుమారుడు తిరిగి తన నాన్నలాగే సేవారంగం, వ్యాపారి తనయుడు వ్యాపారం చేయగా లేనిది.. 20 సంవత్సరాలు ప్రజల్లో ఉన్న రాజకీయ నాయకుల వారసులు భిక్షాటన చేయాలా లేక రాజకీయాల్లోకి ప్రవేశించాలా’’ అని ఘాటుగా సమాధానమిచ్చారు. సోషల్ మీడియాను యాక్టివ్‌గా ఉపయోగించే గోపాల్ భార్గవ కుమారుడు అభిషేక్ ప్రస్తుత మధ్యప్రదేశ్ బీజేపీ యువజన మోర్చా ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. వారసులూ అర్హులే.. మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివ్‌రాజ్ సింగ్ చౌహాన్ హయాంలో వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసిన గౌరీశంకర్ కూడా తన కూతురు మౌసమ్ బీ సేన్‌కు బాలాఘాట్ నియోజకవర్గ లోక్‌సభ టిక్కెట్ ఇవ్వాలని పార్టీ అధిష్టానాన్ని కోరుతున్నారు. 25 సంవత్సరాలు నిండి, పార్టీ భావజాలానికి అనుగుణంగా పనిచేసే నేతల వారసులు ఎంపీ సీట్లలో పోటీ చేయడానికి పూర్తిగా అర్హులని.. వారికి పార్టీ టిక్కెట్లు ఇవ్వాలని గౌరీ శంకర్ మీడియాతో అన్నారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాష్ విజయ్వార్గియా మీడియాతో మాట్లాడుతూ.. తన కుమారుడి కోసం మొన్నటి మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇండోర్-3 నియోజకవర్గ సీటును వదులుకున్నానని , నాయకుల తనయులు టిక్కెట్లను ఆశించడంలో తప్పులేదని, కానీ సీట్ల కేటాయింపులో అంతిమ నిర్ణయాన్ని పార్టీ అధిష్టానానికే వదిలేస్తున్నామని తెలిపారు. పెరుగుతున్న ఒత్తిడి.. ఆగని విమర్శల తాకిడి మాజీ మంత్రి గౌరీ శంకర్ షెజ్వార్ తనయుడు ముదిత్ ఈసారి లోక్‌సభ టిక్కెట్ దక్కించుకున్నారు. లోక్‌సభ మాజీ స్పీకర్ సుమిత్రా మహాజన్ కుమారుడు మందర్, నరేంద్ర సింగ్ తోమర్ వారసుడు దేవేంద్రకు బీజేపీ టిక్కెట్లు ఇవ్వడానికి నిరాకరించింది. సీనియర్ నాయకుడు రాఘవాజీ తన కుమార్తె జ్యోతి షాను అసెంబ్లీ ఎన్నికల బరిలో దించాలని ప్రయత్నించినా బీజేపీ హైకమాండ్ తిరస్కరించింది. నిరుత్సాహపడిన రాఘవాజీ తన తనయకు లోక్‌సభ ఎన్నికల్లోనైనా పార్టీ నుంచి పోటీ చేసే అవకాశమివ్వాల్సిందేనని బీజేపీపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. బీజేపీలో జరుగుతున్న వారసత్వ రగడను చూసి కాంగ్రెస్ సంబరపడుతోంది. ఇన్ని రోజుల నుంచి తమను విమర్శిస్తూ వచ్చిన కాషాయ నేతలపై ఇదే అదనుగా హస్తం నేతలు వాగ్బాణాలను సంధిస్తున్నారు. పార్టీలో నెలకొన్న వారసత్వ కుంపట్లను బీజేపీ అధిష్టానం ఎలా చల్లారుస్తుందో చూడాలి. -
దిక్కు తోచని స్ధితిలో టీడీపీ
-
టెన్షన్.. టెన్షన్
ఉమ్మడి జిల్లా పరిధిలో ఐదు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసిన కాంగ్రెస్ అధిష్టానం.. నిజామాబాద్ రూరల్, బాల్కొండ, నిజామాబాద్ అర్బన్, ఎల్లారెడ్డి స్థానాలకు తేల్చలేదు. మహా కూటమి పొత్తులో భాగంగా ఈ నాలుగు స్థానాల్లో ఒకటి టీడీపీకి కేటాయించే అవకాశాలు ఉండటంతో ఆ స్థానాలను ఆశిస్తున్న కాంగ్రెస్ ఆశావహుల్లో టెన్షన్ నెలకొంది. రూరల్‌లో మాజీ మంత్రి మండవ వెంకటేశ్వర్రావు పోటీ చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. టీడీపీకి చెందిన మల్లికార్జున్‌రెడ్డి ఢిల్లీకి వెళ్లి బాల్కొండ స్థానం కోసం ప్రయత్నాలు సాగిస్తుండటం ఆసక్తికరంగా మారింది. సాక్షి ,నిజామాబాద్: మహాకూటమిలో టిక్కెట్ల రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఉమ్మడి జిల్లా పరిధిలో ఐదు స్థానాలకు అభ్యర్థు లను ఖరారు చేసిన కాంగ్రెస్ అధిష్టానం నాలుగు చోట్ల అభ్యర్థులను ప్రకటించలేదు. కూటమి పొత్తుల్లో భాగంగా ఈ నాలుగు స్థానాల్లో ఒకటి టీడీపీకి కేటాయించే అవకాశాలు కనిపిస్తుండటం తో ఆ స్థానాలను ఆశిస్తున్న కాంగ్రెస్ ఆశావహు ల్లో టెన్షన్ నెలకొంది. సోమవారం అర్ధరాత్రి ప్రకటించిన జాబితాలో బోధన్, కామారెడ్డి, ఆర్మూర్, బాన్సువాడ, జుక్కల్ స్థానాలకు అభ్యర్థులు ఖరారయ్యారు. నిజామాబాద్ రూరల్, బాల్కొండ, నిజామాబాద్ అర్బన్, ఎల్లారెడ్డి స్థానాలకు అభ్యర్థులెవరో తేల్చలేదు. అయితే నిజామాబాద్ రూరల్‌తో పాటు, బాల్కొండ స్థానాలపై టీడీపీ కన్నేసిన విషయం విదితమే. రూరల్‌లో మాజీ మంత్రి మండవ వెంకటేశ్వర్రావు పోటీ చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. దీంతో ఈ టికెట్‌ను ఆశిస్తున్న డాక్టర్ భూపతిరెడ్డి, అర్కల నర్సారెడ్డిల్లో టెన్షన్ నెలకొంది. పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో భూపతిరెడ్డి ప్రయత్నాలు చేస్తుండగా, రేవంత్‌రెడ్డి ద్వారా అర్కల టికెట్ కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఈ క్రమంలో నిజామాబాద్‌రూరల్ స్థానం టీడీపీకి కేటాయిస్తారనే అంశం తెరపైకి రావడంతో ఇటు ఆ పార్టీ వర్గాల్లోనూ అయోమయం నెలకొంది. జిల్లాలో బాల్కొండ స్థానానికి కూడా అధిష్టానం అభ్యర్థిని ప్రకటించలేదు. ఇక్కడ కాంగ్రెస్ నుంచి అనీల్ టికెట్ రేసులో ఉండగా, టీడీపీ కోటాలో కాంగ్రెస్ గుర్తుపై పోటీ చేసేందుకు ఏలేటి మల్లికార్జున్‌రెడ్డి ఆశిస్తున్నారు. సైకిల్ గుర్తుపై పోటీ చేస్తే ఓట్లు బదిలీ కావడం అసాధ్యమని భావిస్తున్న మల్లికార్జున్‌రెడ్డి కాంగ్రెస్ గుర్తుపై బరిలోకి దిగాలని యోచిస్తున్నారు. టీడీపీకి చెందిన మల్లికార్జున్‌రెడ్డి ఢిల్లీకి వెళ్లి ప్రయత్నాలు సాగిస్తుండటం ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలోనే నిజామాబాద్ రూరల్, బాల్కొండ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించకుండా పెండింగ్‌లో పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. ఆసక్తికరంగా అర్బన్ రాజకీయాలు.. నిజామాబాద్ అర్బన్లోనూ కాంగ్రెస్ టికెట్ల గోల ఆ పార్టీ వర్గాలను గందరగోళానికి గురి చేస్తోంది. అర్బన్ స్థానాన్ని కూటమిలో భాగస్వామ్య పార్టీలు కోరడం లేదు. కానీ అధిష్టానం మాత్రం అభ్యర్థిని ప్రకటించలేదు. బొమ్మా మహేష్‌కుమార్‌గౌడ్, డీసీసీ అధ్యక్షులు తాహెర్‌బిన్ హందాన్, రత్నాకర్ పేర్లు ప్రారంభంలో వినిపించినప్పటికీ.. ఇప్పుడు కొత్త పేర్లు తెరపైకి వస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది ఎల్లారెడ్డిపై రేవంత్‌వర్గం పట్టు.. ఎల్లారెడ్డి స్థానానికి నల్లమడుగు సురేందర్, సుభాష్‌రెడ్డి ఎవరికి వారే ప్రయత్నాలు చేస్తున్నారు. తన వర్గీయుడైన సుభాష్‌రెడ్డికి టికెట్ ఇప్పించుకునేందుకు రేవంత్‌రెడ్డి ప్రయత్నాలు సాగిస్తున్నారనే ప్రచారం సాగుతోంది. ఈస్థానంతోపాటు మిగతా మూడు స్థానాలను ఎవరికి కేటాయిస్తారనేది బుధవారం తేలనుంది. -
కాంగ్రెస్ పార్టీకి ఇంటి పార్టీ సెగ
-
టీఆర్ఎస్లో తీవ్రమవుతున్న టికెట్ల లొల్లి
-
టీఆర్ఎస్లో టిక్కెట్ల లొల్లి
-
టికెట్ల కేటాయింపులో డీ‘ఎస్’ మార్క్!
నిజామాబాద్‌అర్బన్, న్యూస్‌లైన్ : నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో తన ఆధిపత్యాన్ని నిలుపుకునే దిశగా పీసీసీ మాజీ చీఫ్, ఎమ్మెల్సీ డీ. శ్రీనివాస్ పావులు కదిపారు. బల్దియా బరిలో నిలిచే అభ్యర్థుల జాబితాను సోమవారం ఖరారు చేశారు. ఇందులో పలువురు సీనియర్ల పేర్లు గల్లంతు కావడం, మిగతా సీనియర్ నాయకుల ప్రతిపాదనలకు స్థానం లేకపోవడం సిటీలో చర్చనీయాంశంగా మారింది. అనుకూలంగా ఉన్నవాళ్లకే కార్పొరేషన్లో టికెట్ల కేటాయింపులో ఎమ్మెల్సీ డి.శ్రీనివాస్, మాజీ మేయర్ సంజయ్ తమ ఆధిపత్యం నెగ్గించుకున్నారు. తమకు అనుకూలంగా ఉన్నవారికి టికెట్లు ఇప్పించుకున్నట్లు ఆ పార్టీ నేతలు పేర్కొంటున్నారు. టికెట్లు ఆశించిన జెండాగుడి మాజీ చైర్మన్ నాని, సీనియర్ నాయకుడు శ్రీహరికి టికెట్లు రాకపోవడం వెనుక డీఎస్ అనుచరుల హస్తం ఉన్నట్లు విమర్శలు వస్తున్నాయి. మైనార్టీ నాయకుడు అబ్ధుల్‌కు చెందిన వారికీ టికెట్లు కేటాయించలేదు. ప్రతిష్టాత్మకంగా మారిన 50వ డివిజన్లో ఇద్దరు బలమైన నాయకులున్నా ఛాగుభాయ్కి కేటాయించారు. సీనియర్లకు చుక్కెదురు కార్పొరేషన్లో టికెట్ల కేటాయింపులో ముఖ్యమైన నాయకులకు చుక్కెదురైంది. మాజీ డీసీసీ అధ్యక్షుడు గడుగు గంగాధర్, ప్రస్తుత డీసీసీ అధ్యక్షుడు తాహెర్బిన్ల పాత్ర నామమాత్రం కూడా లేకుండా పోయింది. వీరు తమ అనుచరులకు టికెట్లు ఇప్పించుకోవడంలో విఫలమయ్యారు. తాహెర్బిహన్కు తెలియకుండానే టికెట్ల కేటాయింపు జరిగింది. డీఎస్‌కు ముఖ్య అనుచరుడిగా పేరున్న రత్నాకర్, ఆయనకు సన్నిహితంగా మరో విద్యార్థి నాయకుడు తమ వారికి టికెట్లు ఇప్పించుకోవాలని ప్రయత్నాలు చేసి విఫలమయ్యారు. డీఎస్ మరో ముఖ్యఅనుచరుడైన వేణు, ఇతర నాయకులు ప్రతిపాదనలనే టికెట్ల కేటాయింపులో పరిగణనలోకి తీసుకున్నట్లు తెలిసింది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలోనే నిజామాబాద్ అర్బన్ అసెంబ్లీ స్థానాన్ని తిరిగి హస్తగతం చేసుకోవాలన్న లక్ష్యంతోనే డీఎస్ మున్సిపల్ కార్పొరేటర్ అభ్యర్థులను ఎంపిక చేసినట్లు పార్టీ నాయకులు చెబుతున్నారు. సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని టికెట్ల కేటాయింపు చేసినట్లు పేర్కొంటున్నారు. మరోవైపు తమకు, తమ అనుచరులకు టికెట్లు కేటాయించకపోవడంతో పలువురు నాయకులు గుర్రుగా ఉన్నారు.