![women writhing in pain as they're whipped by priests](/styles/webp/s3/article_images/2017/10/7/beat_1.jpg.webp?itok=CVtY5t39)
తమిళనాడు: సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతూ ప్రపంచం కుగ్రామంగా మారిపోతున్న తరుణంలో కూడా కొంత మంది ప్రజలను మూఢనమ్మకాలు ఇంకా వెంటాడుతున్నాయి. భూ ప్రపంచంలోని ప్రాణులన్నింటిలో మనిషి జ్ఞానవంతుడుగా నిరూపించుకున్నాడు. ఇటువంటి అధునిక యుగంలో ఇంకా మూఢ నమ్మకాలను నమ్మే మనుషులు లేకపోలేదు. దక్షిణ భారతదేశంలోని తమిళనాడు దేవాలయాలకు ప్రసిద్ధి అన్న విషయం మనకు తెలిసిందే. అయితే అక్కడ ఓ దేవాలయంలో ప్రతి ఏటా ఓ విచిత్రమైన ఆచారం మనకు దర్శనమిస్తుంటుంది.
తిరువనంతపురంలో అతి ప్రాచీనమైన అచప్పన్ దేవాలయం ఉంది. ఇక్కడ జరిగే ఓ ఉత్సవంలో మహిళలు తమకు మంచి జరగాలని పురోహితులతో మోకాళ్లపై కూర్చొని కొరడాలతో కొట్టించుకుంటారు. ఈ పురాతనమైన అచప్పన్ దేవాలయంలోని పూజారులతో కొరడా పూజ చేయించుకుంటే వారికి పట్టిన చీడ, పీడలు, మానసిక, శారీరక రోగాలు తోలగిపోయి మంచి జరుగుతుందని అక్కడి మహిళలు నమ్ముతున్నారు. ప్రతి సంవత్సరం సుమారు 2000 మందికి పైగా మహిళలు ఈ తంతులో పాల్గొని దెబ్బలు తింటున్నారు. అయితే తల్లిదండ్రులు తమ పిల్లలకు కొరడా దెబ్బలు రుచి చూపించటం గమనార్హం.
ఇక్కడి సాంప్రదాయం ప్రకారం పూజారులతో కొరడాలతో కొట్టించుకొవడం నేరం కాదని పలువురు చెబుతున్నారు. ‘ నేను ఇందులో పాల్గొని కొరడా దెబ్బలు స్వీకరించిన తరువాత నాకున్న శారీరక, మానసిక జబ్బులన్ని నయం అయ్యాయని’ ఓ 60 ఏళ్ల మహిళ చెప్పింది. ఓ విద్యార్థి ‘ తాను బాగా చదవడంలేదని తల్లిదండ్రులు ఆమెను అక్కడి తీసుకెళ్లి కొరడాతో కొట్టించారని, దీంతో ఆ కొరడా వాతలను చూసి స్నేహితులంతా నవ్వుకున్నారని’ చెప్పింది.
![1](/gallery_images/2017/10/7/beat_2.jpg)
![2](/gallery_images/2017/10/7/beat_3.jpg)
![3](/gallery_images/2017/10/7/beat_4.jpg)
![4](/gallery_images/2017/10/7/beat_5.jpg)
![5](/gallery_images/2017/10/7/beat_6.jpg)
![6](/gallery_images/2017/10/7/beat_7.jpg)
![7](/gallery_images/2017/10/7/beat_8.jpg)
![8](/gallery_images/2017/10/7/beat_9.jpg)
Comments
Please login to add a commentAdd a comment