
తిరువనంతపురం: తన తనయుడు చేసిన నిర్వాకం కారణంగా కేరళ సీపీఎం చీఫ్ కొడియేరి బాలకృష్ణన్ తన పదవికి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. బాలకృష్ణన్ తన కుమారుడి అనైతిక ప్రవర్తనకు మూల్యం చెల్లించుకోవలసిన పరిస్థితి వచ్చింది. ఆయన కుమారుడు బినయ్ తనపై అత్యాచారం చేసినట్లు ఓ మహిళ ముంబైలో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆయనపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో తన పదవికి రాజీనామా సమర్పించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఆయన రాజీనామా వార్తలపై పార్టీ వర్గాలు ఇప్పటి వరకు స్పందించలేదు. కాగా ఘటనపై స్పందించిన బాలకృష్ణన్ .. నిందిడుడిని ఎవరూ రక్షించలేరని పేర్కొన్నారు.
బాలకృష్ణన్ కుమారుడు బినయ్ తనపై అత్యాచారం చేసినట్లు బిహార్‌కు చెందిన ఓ మహిళ ఇటీవల ముంబైలో ఫిర్యాదు చేశారు. తనను చాలా సంవత్సరాలుగా ఆయన లైంగికంగా వేధిస్తున్నారని ఆరోపించారు. తన ఎనిమిదేళ్ళ బిడ్డకు తండ్రి ఆయనేనని పేర్కొన్నారు. ఈ వాస్తవాన్ని నిరూపించేందుకు ఎటువంటి పరీక్షలకైనా తాను సిద్ధమేనని చెప్పారు. బినయ్ దుబాయ్‌లో వ్యాపారం చేస్తుండగా.. ఆమెకూడా దుబాయ్‌లో బార్ డ్యాన్సర్‌గా చేసినట్లు పోలీసులు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment