
'ఆర్ఎస్ఎస్ కనుసన్నల్లో పాలన'
శాంతిసామరస్యాలకు నిలయంగా విలసిల్లిన భారత్ ఇప్పుడు గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోందని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఏకే ఆంటోనీ ఆందోళన వ్యక్తం చేశారు.
తిరువనంతపురం: శాంతిసామరస్యాలకు నిలయంగా విలసిల్లిన భారత్ ఇప్పుడు గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోందని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఏకే ఆంటోనీ ఆందోళన వ్యక్తం చేశారు. నరేంద్ర మోదీ పాలనలో దేశంలో విపత్కర పరిస్థితులు తలెత్తాయని అన్నారు. 'ప్రస్తుతం దేశంలో గడ్డు పరిస్థితులు నెలకొన్నాయి. భారత్ ఒకప్పుడు రోల్ మోడల్ గా ఉండేది. ఏం తింటున్నారు, ఏం ధరిస్తున్నారు, ఏం రాస్తున్నారనేది బీజేపీ, ఆర్ఎస్ఎస్, సంఘ్ పరివార్ పర్యవేక్షిస్తున్నాయి' అని ఆంటోనీ అన్నారు.
నరేంద్ర మోదీ పాలనలో దేశం ఛిన్నాభిన్నమైందని విమర్శించారు. వ్యవసాయం సంక్షోభంలో పడిందని, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, కొత్తగా పెట్టుబడులు రావడం లేదని తెలిపారు. ముస్లింలు, దళితులపై దాడులు పెరిగిపోయాయని అన్నారు. దేశంలో పాలన ఆర్ఎస్ఎస్ కనుసన్నల్లో నడుస్తోందని ఆంటోనీ ఆరోపించారు.