స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారంలో జీవితకాల నిషేధానికి గురైన క్రికెటర్ శ్రీశాంత్ వ్యవహారంపై బీసీసీఐతో చర్చిస్తానని కేరళ క్రికెట్ సంఘం (కేసీఏ) అధ్యక్షుడు, జాతీయ క్రికెట్ అకాడమీ చైర్మన్ టీసీ మ్యాథ్యూ అన్నారు.
తిరువనంతపురం: స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారంలో జీవితకాల నిషేధానికి గురైన క్రికెటర్ శ్రీశాంత్ వ్యవహారంపై బీసీసీఐతో చర్చిస్తానని కేరళ క్రికెట్ సంఘం (కేసీఏ) అధ్యక్షుడు, జాతీయ క్రికెట్ అకాడమీ చైర్మన్ టీసీ మ్యాథ్యూ అన్నారు.
బోర్డు నిర్ణయాన్ని తమ సంఘం పాటించాల్సిందే అయినా, శ్రీశాంత్‌కు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన చెప్పారు. కొచ్చి అంతర్జాతీయ స్టేడియంలో ప్రాక్టీస్ చేసుకునేందుకు శ్రీకి ఇప్పటికే కేసీఏ అనుమతి కూడా ఇచ్చింది. రాహుల్ ద్రవిడ్ ఎన్‌సీఏ డెరైక్టర్‌గా రావచ్చనే వార్తలపై స్పందిస్తూ... ‘నాకు తెలిసి ద్రవిడ్ కామెంటేటర్‌గానే ఎక్కువ సంపాదిస్తుండవచ్చు’ అని ఆయన వ్యాఖ్యానించారు.