
తిరువనంతపురం : హిందూ సంప్రదాయంలో జరిగే పెళ్లికి కేరళలోని ఓ మసీదు వేదిక కానుంది. ఈ పెళ్లి ఈ నెల 19న జరగనుంది. మసీదుకు సమీపంలో నివసించే పేద హిందూ కుటుంబానికి చెందిన బిందు, అశోకన్‌ల కుమార్తె అంజు (22)కు మసీదులో పెళ్లి జరగనుంది. 2018లో అశోకన్ మరణించినప్పటి నుంచి వీరి కుటుంబం ఆరి్థక ఇబ్బందులను ఎదుర్కుంటోంది. ఈ విషయాన్ని బిందు మసీదు పెద్దల దృష్టికి తీసుకెళ్లడంతో చెరువల్లి జమాత్ కమిటీ కార్యదర్శి నుజుముదీన్ అలుమూట్టిల్ ఈ పెళ్లిని జరిపిస్తామని చెప్పారు. పెళ్లి బహుమానంగా అంజుకు బంగారం, రూ. 2 లక్షలు ఇవ్వడంతో పాటుగా, పెళ్లిలో 1000 మందికి భోజనాలను ఏర్పాటు చేస్తున్నారు. అంజు చదువుకు తాను వ్యక్తిగతంగా సహాయం చేశానని నుజుముదీన్ చెప్పారు. ఈ భిన్నమైన పెళ్లి కార్డులు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment