శశిథరూర్‌కు అరెస్ట్‌ వారెంట్‌ | Court Issued Arrest Warrant to Shashi Tharoor | Sakshi
Sakshi News home page

శశిథరూర్‌కు అరెస్ట్‌ వారెంట్‌

Published Sun, Dec 22 2019 11:39 AM | Last Updated on Sun, Dec 22 2019 11:41 AM

Court Issued Arrest Warrant to Shashi Tharoor - Sakshi

తిరువనంతపురం : కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌కు స్థానిక కోర్టు అరెస్ట్‌ వారెంట్‌ జారీ చేసింది. ఆయన రాసిన ‘ద గ్రేట్‌ ఇండియన్‌ నావెల్‌’ అనే పుస్తకంలో హిందూ మహిళలను అవమానపరిచాడని దాఖలైన కేసులో ఆయనకు ఈ  వారెంట్‌ జారీ చేయబడింది. వారెంట్‌లో తన వాదనను వినిపించడానికి శశిథరూర్‌ గానీ, లేదా ఆయన లాయర్‌గానీ కోర్టు వాయిదాలకు హాజరు కాలేదని, అందుకోసం అరెస్ట్‌ వారెంట్‌ జారీ చేస్తున్నట్టు తెలపబడింది. ఈ విషయంపై శశిథరూర్‌ అఫీస్‌ వర్గాలు వివరణనిస్తూ.. ‘వారెంట్‌ జారీ అయినట్టు మాకు మీడియా ద్వారానే తెలిసింది. అధికారికంగా మాకు ఎలాంటి సమాచారం రాలేదు. ఇంతకుముందు కోర్టుకు హాజరుకావాలని సమన్లు వచ్చాయి. అయితే అందులో ఏ తేదీన  హాజరు కావాలో లేనందున ఆ విషయాన్ని మేం కోర్టు దృష్టికి తీసుకెళ్లాం. దీంత కోర్టు వారు తేదీతో సహా పేర్కొని మరోసారి నోటీసు జారీ చేస్తామన్నారు. దాని ఆధారంగా మా తదుపరి కార్యాచరణ ఉంటుంద’ని ఆఫీస్‌ వర్గాలు తెలిపాయి. ఈ పుస్తకం మొదటి ప్రచురణ 1989లో జరిగింది. కాగా, శశిథరూర్‌కు ఇటీవలే కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చిన విషయం తెలసిందే. చదవండి : (దేశ చిత్రపటంతో శశిథరూర్‌ వివాదాస్పద ట్వీట్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement