మళ్ళీ ఆయనే గెలుస్తారు: నటుడు ప్రకాష్ రాజ్ | Shashi Tharoor Term Again Comes Again Says Actor Prakash Raj | Sakshi
Sakshi News home page

మళ్ళీ ఆయనే గెలుస్తారు: నటుడు ప్రకాష్ రాజ్

Published Tue, Apr 23 2024 1:39 PM | Last Updated on Tue, Apr 23 2024 3:08 PM

Shashi Tharoor Term Again Comes Again Says Actor Prakash Raj - Sakshi

తిరువనంతపురం: దేశంలో ఎన్నికల పోరు జోరుగా సాగుతున్న తరుణంలో సీనియర్ నేతలు సైతం నువ్వా.. నేనా అన్నట్లు తలపడుతున్నారు. ఈ సమయంలో ప్రముఖ సినీ నటుడు ప్రకాష్ రాజ్ తిరువనంతపురం లోక్‌సభ నియోజకవర్గం నుంచి మళ్ళీ 'శశిథరూర్' విజయం సాధిస్తారని అన్నారు.

జరగబోయే 2024 లోక్‌సభ ఎన్నికలో శశిథరూర్ మళ్ళీ విజయం సాధిస్తారని నటుడు ప్రకాష్ రాజ్ అన్నారు. తిరువనంతపురం నియోజకవర్గం కాంగ్రెస్ నాయకుడు శశి థరూర్ నుంచి చాలా అందుకుంది. కాబట్టి మళ్ళీ ఆయనే గెలుస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు.

శశి థరూర్ నా స్నేహితుడు, గొప్ప నాయకుడు. అందుకే అతని అండగా నిలబడటానికి నేను వచ్చానని ప్రకాష్ రాజ్ అన్నారు. ప్రస్తుతం ఈయన (శశి థరూర్) కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) నాయకుడు పన్నియన్ రవీంద్రన్‌లను ఎదుర్కొని పోటీకి నిలబడుతున్నారని అన్నారు.

2009 నుంచి గెలుస్తున్న శశి థరూర్‌కు వ్యతిరేకంగా బీజేపీ బలమైన నాయకున్ని బరిలోకి దింపింది. కాబట్టి ఈ సారి జరగబోయే ఎన్నికలు మరింత ఆసక్తికరంగా ఉంటాయి. 20 ఎంపీ స్థానాలకు కేరళ రాష్ట్రంలో 2019లో 19 స్థానాలను కాంగ్రెస్ సొంతం చేసుకోగా.. ఒక స్థానంలో సీపీఎం గెలుపొందింది. బీజేపీ విఫలమైంది.

2016లో ఒక్కసారి మాత్రమే బీజేపీ నెమోమ్ అసెంబ్లీ స్థానంలో గెలిచింది. అయితే ఇప్పటివరకు బీజేపీ ఎంపీ స్థానాన్ని గెలుచుకోలేదు. కాగా కేరళలోని మొత్తం 20 లోక్‌సభ నియోజకవర్గాలకు ఏప్రిల్ 26న ఒకే దశలో పోలింగ్ జరగనుంది. జూన్ 4న కౌంటింగ్ జరగనుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement